Tuesday, 19 June 2012

దర్జాలేని దర్జీ బతుకు


June 13, 2012
కొలతలు తీయడానికి టేపులేని రోజులో మూర, జాన, బెత్త... లెక్కల చొప్పున కొలతలు తీసేవారు. రాసుకునే పద్ధతులు లేకపోవటంతో తీసుకున్న కొలతల ప్రకారం బట్టలేక ఎక్కడికక్కడ గాట్టుపెట్టి చించేవాళ్లు. కనుకనే వీళ్లని చింపేవాళ్లని చెప్పుకునేవారు. కాలక్రమంలో చింపేవాళ్లు కాస్తా చిప్పోలుగా మారారు. వీరే మేరు కులస్థులు. వీరి కుల వృత్తి దర్జీపని. తనకు తెలిసిన విద్య నలుగురికీ నేర్పి ఉపాధి కల్పించిన ఈ స్నేహశీలికి అన్నీ కష్టాలే!

jangamaమేరు కులస్తులు పూర్వపు రోజుల్లో సంచార జాతిగా జీవనం గడిపేవారు. ఇంటిల్లపాదీ ఊరూరా తిరుగుతూ బట్టలు కుట్టి జీ వించేవారు. అంతేకాదు... సైన్యంలోని సైనికుల దుస్తులు, వా రి కుటుంబ సభ్యులకు కావలసిన దుస్తులు కుట్టడానికి మేరు కులస్తులు వారి వెంట ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెజి మెంట్లు ఏ ప్రాంతానికి తరలిపోతే వీరూ... వారి వెంట వెళ్లాల్సి వచ్చేది. ఈ విధంగా తిరిగి తిరిగి చివరకు హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, బెంగళూరులోని జాల హళ్లి, మహారాష్ర్టలో పూ ణ, ఖడ్కి, ఔరంగాబాద్‌, నాగపూర్‌లలో ఛావనీలో వీరు స్థిర ని వాసం ఏర్పరచుకున్నారు. మహారాష్ర్టలో సింపీ క్షత్రియులుగా ఉన్న వీరు మన రాష్ర్టంలో చిప్పోలు, మేరు కులస్తులుగా వీరు పిలువబడుతున్నారు. రాష్ర్ట వ్యాపితంగా వీరు విస్తరించినప్ప టికీ తెలంగాణ ప్రాంతంతోపాటు, గుంటూరు, కృష్ణా జిల్లాల లోనే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.

జనాభా రీత్యా వీరు తక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా ఇత ర కులాలవారికి వీరు టైలరింగ్‌ వృత్తి నేర్పి పని కల్పించారు. నీడపట్టున ఉండి పనిచేయటం, రోజుగడిచేందుకు చేతికి డబ్బు అందుతున్న కారణంగా అనేకమంది ఈ వృత్తికి ఆకర్షి తులయ్యారు. పండుగ సీజన్‌ వచ్చిందంటే రాత్రింబవళ్లు పని చేసేవారు. కుట్టుమిషన్‌ ఉన్న స్పీడుతో పోటీపడి పనిచేసి కస్ట మర్లను తృప్తి పరిచేవాళ్లు. మహిళలు, పిల్లలూ కలిసి కాజాలు తీయటం, గుండీలు, హుక్కులు కుట్టటం, చేతిపని చేస్తూ సహకరించేవారు. ఈ విధంగా వచ్చే డబ్బుతోనే వీరు జీవనం సాగించేవారు. బట్టలు కుట్టించుకోవటం ఏడాదికి ఒకసారి వచ్చే పండగలకే పరిమితం కావటంతో వీరు సీజన్‌లో సంపాదించుకున్న డబ్బును పొదుపుగా వాడుకుని అన్‌సీజన్‌ లో కుటుంబ ఖర్చు లకు ఉపయోగించుకునేవారు.

పూర్వం చేతివృత్తిగా ఆవిర్భవించిన దర్జీపని నేడు పెద్ద ఇండ స్ట్రీగా వెలుగొందుతోంది. కాగా అందులో వీరు దినసరి కార్మి కులుగా పనిచేయాల్సి వస్తోంది. అదికూడా అత్యల్పసంఖ్యలోనే వీరు పనిచేస్తున్నారు. వాస్తవానికి పెడల్‌ మిషన్‌ స్థానంలో ఎల క్ట్రికల్‌ సూయింగ్‌ మిషన్లు చోటుచేనుకున్న రోజుల్లోనే తమకు కష్టకాలం దాపురించిందనే అంశాన్ని పసిగట్టారు. కుల వృత్తి లోకి ఇతరులు చొచ్చుకురావటం కూడా వీరికి సమస్యగా మారింది. వీటికితోడు కటింగ్‌ మిషన్లు రావటంతో వీరి మను గడే ప్రశ్నార్ధకరంగా మారింది. ఇక ‘జుకి’ మిషన్‌ రంగప్రవే శంలో మేరు వృత్తిదారులే కాదు, యావత్‌ టైలరింగ్‌ రంగం కుదేలయ్యింది. ఈ మిషన్‌ ద్వారా భారీ ఎత్తున రకరకాల ఫ్యా షన్లతో డ్రస్పులు తయారవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న బడా వ్యాపారులు రాష్ర్టంలో ఇండస్ట్రీస్‌ ప్రారం భించి లాభాలు ఆర్జిస్తున్నారు. దాదాపు పాతిక వరకు ఇటువం టి ఇండస్ట్రీలు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక్కొక్క ఇండ స్ట్రీలో దాదాపు 300మందికి జీవనోపాధి దొరుకుతున్నప్పటికీ మేరు కులస్తులకు మాతం ఉపాధి లభించింది బహుతక్కువ.

ప్రపంచం స్పీడ్‌ కావటంతో ఎక్కువమంది రెడీమేడ్‌ దుస్తు లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

నుక మేరు కులస్తులు పనికోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. రెడీమేడ్‌ డ్రస్‌ సెంటర్ల సంఖ్య గణనీయంగా పెరుగడంతో వీరు ఉపాధి కోల్పోతు న్నారు. కొత్త జత వేసుకోవాలంటే బట్టల కొనుగోలుతోపాటు దర్జీకి కుట్టుకూలీయే జత బట్టలకు రూ.200 ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో రెడీమేడ్‌ షాపులవెైపే సామాన్య మానవులు సైతం పరుగులు తీస్తున్నారు.ఈ నేపథ్యంలో రోజు మొత్తం కు ట్టుపని చేసినా మేరు కులస్తులకు వంద రూపాయల సంపాద నలేదు. ఇక పీస్‌ వర్క్‌ కూడా వీరి వృత్తిని దెబ్బతీస్తోంది. బడా బాబులు హంగులతో రూపుదిద్దుకున్న షాపుల నుంచి వీరికివ చ్చే పీస్‌ వర్క్‌ వారి దయాదాక్షిణ్యాలపెై ఆధారపడాల్సి వస్తోంది. కనుకనే ఈ వృత్తికి దూరమవుతున్నారు. బతుకుదెరువు కోసం మరో పని చేసుకునే ప్రయత్నం చేస్త్తున్నారు. ప్రభుత్వపరంగా మేరు కులస్తులకు ఎటువంటి సహాయం అందలేదనే చెప్పాలి. పాఠశాలల్లో క్రాఫ్ట్‌ క్లాసులు నిర్వహించి కుట్టు పనిని ప్రభుత్వం ప్రోత్సహించింది.

వీటి ద్వారా ఇతర కులాలవారు ఇందులో ప్రవేశించారు. అదే విధంగా నిఫ్ట్‌ ద్వారా ఫ్యాషన్‌ టెక్నాలజీని ప్రోత్సహించింది. ఫలితంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ వృత్తిని కైవశం చేసుకున్నారు. మహిళలకు ఉపాధి పేరుతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కుట్టు మిషన్లు అందించటంతో మేరు కులస్తులకు అరకొరగా అందుతున్న ఉపాధికి కూడా గండి పండింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేరు కులస్తుల అభివృద్ధికి సబ్సిడీలు కాదుకదా, కనీసం బ్యాంకు లోనులు కూడా ఇచ్చి ప్రోత్సాహించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో చెైనా మ్యూజియంలో పెడల్‌ కుట్టుమిషన్‌ ఏ విధంగా చోటు సంపాదించుకుందో ఇక్కడా అటువంటి పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది.

ఆర్ధికంగా ఆదుకోవాలి;
drjiవివిధ కులాలకు చెందివారు దర్జీ పనిని ఎంచుకోవడం, అటు రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలతో పోటీపడలేక మేరు కులస్తులు అర్థాకలితో జీవితాలు గడుపుతున్నారు. కనుక ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మేరు సంఘం రాష్ర్ట అధ్యక్షులు కీర్తి ప్రభాకర్‌ కోరుతున్నారు. కుట్టు పని చేసేవారికి ప్రభుత్వం ఫెడరేషన్‌ ప్రకటించినప్పటికీ తమ మేరు కులస్తులకు మాత్రం అది ప్రయోజనం చేకూర్చలేదంటారు. కనీసం వృద్థులెైన మేరు కులస్తులకు ప్రత్యేకించి వృద్ధాప్య పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వృత్తి దెబ్బతినడంతో ఇప్పటితరం విద్య పట్ల శ్రద్ధ చూపుతున్నారు కనుక మేరు కుల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తమని ప్రభుత్వం బిసి డి జాబితాలో చేర్చడం వలన న్యాయంగా తమకు అందాల్సిన ఫలాలు అందట్లేదని చెప్పారు. మేరు కులస్తులు సంచార జాతికి చెందిన వారు కావటంతో బిసి ఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్‌ యూనిఫారం, హాస్పిటల్స్‌లో ఉపయోగించే డ్రస్‌లు, హాస్టల్‌ విద్యార్ధుల డ్రస్‌లు కుట్టే అవకాశం ప్రభుత్వం మేరు కులస్తులకు ఇచ్చి ఆదుకోవాలంటారు.

jkl

కనుమరుగవుతున్న నకాషీల నగిషీలు!


June 14, 2012
nagashi0 
భారతీయ హస్తకళా సంస్కృతికి మకుటాయమానం నిర్మల్‌ బొమ్మలు, పెయింటింగ్స్‌. ఇవి తెలుగువారి హస్తకళా కౌశలాన్ని ప్రపంచానికి చాటిచెపుతున్నాయి. అయితే ఈ ఘనత ఎంతోకాలం నిలిచేపరిస్థితులు కనిపించట్లేదు. బొమ్మల తయారీకి కావలసిన చెక్క అందుబాటులో లేకపోవడంతో ఈ కళాకారులు అడ్డాల దగ్గర కూలీలుగా మారుతున్నారు. దొరికిన పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నకాషీ... పేరు చెపితే ఈ కులస్తులు మన రాష్ర్టంలో ఎక్కడున్నారనే ప్రశ్న రాకమానదు. అదే నిర్మల్‌ పేరు చెపితే మాత్రం, వెంటనే ఆదిలాబాద్‌ జిల్లా గుర్తొస్తుంది.

నిర్మల్‌ పెయింటింగ్స్‌, నిర్మల్‌ బొమ్మల రూపశిల్పులు వీరే! వీరిని చిత్తారి, చిత్రకార్‌ అని కూడా పిలుస్తారు. కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారు చేస్తారు. వీరు ఎక్కడ ఉన్నా ఈ కళ తమకే పరిమితం కావాలని భావించేవారు కాదు. శిక్షణ కేంద్రాలు పెట్టి ఇతరులకు కూడా ఈ కళను నేర్పించే ప్రయత్నం చేశారు. విడివిడిగా ఉంటే బడా వ్యాపారుల పోటీకి తట్టుకోలేరనే భావనతో ఐక్యంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సొసైటీ ప్రారంభించి దాని ద్వారా తయారుచేసిన బొమ్మలు మార్కెట్‌ చేస్తున్నారు. ఇక గణేష్‌ ఉత్సవాలు వచ్చాయంటే మట్టి బొమ్మలు తయారుచేసి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతున్నారు.

వీరి పూర్వీకులు మహారాష్ర్టకు చెందివారు. 17వ శతాబ్దాంలో నిమ్మల (ప్రస్తుత నిర్మల్‌)ను పాలించిన పద్మనాయక్‌ వంశానికి చెందిన నిమ్మనాయుడు కళారాధకుడు. మహారాష్ర్ట నుంచి నకాషీ కళాకారులను రప్పించి కొయ్యబొమ్మల తయారీని ప్రోత్సహించారు. అప్పటి నుంచి కొయ్యబొమ్మలకు నిర్మల్‌ పేరుగాంచింది. అయితే నిర్మల్‌ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకుని వీరు బొమ్మలు తయారుచేయటానికి ఒక కారణం ఉంది. ఈ ప్రాంతంలోని అడవులలో పెరిగిన ‘పొనికి’ అనే చెట్టు బొమ్మల తయారీకి ఉపయోగపడుతోంది. ఎండిన పొనికి చెక్కకు నగిషీలు చెక్కి నకాషీలు కొయ్య బొమ్మలను తయారుచేస్తారు. అయితే ఈ చెట్లు అంతరించిపోయే దశకు చేరుకోవటంతో కర్ర దొరకటం గగనమైంది.

nagashiఅడవిలోని ఈ పొనికి చెట్లను నరికితే అటవీ శాఖ అధికారులు కేసులు పెడతారు. కనుక వీరు అడవిలో తిరిగి ఎక్కడన్నా ఎండిన పొనిక మోడు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు చూపిస్తారు. వారి అనుమతితో సొసైటీ ద్వారా వీరు ఆ మోడును నరికించుకుని తెచ్చుకుంటారు. దీనికి కూడా వీరు పన్ను చెల్లించాలి. జన్నారం, ఉట్నూరు ప్రాంతాలేకాదు... బెల్లంపల్లి, నెన్నెల, భీమారం, రాయదరి, తదితరప్రాంతాల నుంచి ఈ కర్ర తెప్పించుకునే వారు. నిర్మల్‌కు ఆయా ప్రాంతాలు దూరం కావటంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో కూడా ఈ పొనికి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ చెట్లను పెంచే ప్రయ త్నాలు ప్రభుత్వం చేపట్టి నప్పటికీ సఫలం కాలేదు. ఇదిలా ఉంటే... ఉన్న చెట్లను మత్యకారులు నరికి తెప్పలు తయారు చేస్తున్నారు.

ఈ కలప బరువుతక్కుగా ఉండటం, చీడపీడలకు గురికాకుండా ఎక్కువ కాలం మన్నుతుంది కనుక దీనిపై వారు కన్ను వేశారు. ఈ విధంగా ఎన్నో కష్టా లను ఎదుర్కొంటెతప్ప పొనికి చెక్క ఇంటికి చేరదు. మహిళలు చిన్న చిన్న బొమ్మలను తయారుచేస్తే, పురుషులు పెద్దవి, కళాత్మక విలువలున్నవి తయారుచేస్తారు. చిన్న పిల్లలు సైతం బొమ్మల తయారీకి సహకరిస్తారు. తయారైన విడిభాగాలను అతికించడానికి చింతపిక్కల అంబలిని ఉపయోగిస్తారు. సకాలంలో చెక్క దొరకని పక్షంలో పస్తులే. సకాలంలో చెక్క చేతికి అందితే మాత్రం నెలలో 50 బొమ్మలు తయారుచేస్తారు.

001వీటికి అన్ని రంగులూ అద్ది మార్కెట్‌ చేస్తే మూడు వేల రూపాయలు వస్తాయి. అంటే ఇంటిల్లపాదీ కష్టపడి సహకార సంఘ ద్వారా అమ్మితే చేతికందేది మూడు వేల రూపాయలు మాత్రమే. వీటిని అమ్ముకోవటానికి నేటికీ వీరు ఊళ్లుపట్టి తిరుగుతున్నవారూ ఉన్నారు. ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగితే అక్కడకు వెళ్ళి తాము తయారుచేసిన వస్తువులను మార్కెట్‌ చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారుచేస్తారు. అయినప్పటికీ కళాకారులుగా వీరికి ఎటువంటి గుర్తింపులేదు.

నిర్మల్‌ పెయింటింగ్స్‌కు దేశ విదేశాలలో తమ విశిష్టతను చాటుతున్నాయి. భారతీయ సంస్కృతిని ఇవి చాటుతున్నాయి. ఈ పెయింటింగ్‌ పై నీళ్లు పడినా పాడైపోదు. దాదాపు వందేళ్ల వరకు చెక్కుచెదరదు. కనుకనే ఈ పెయింటింగ్స్‌ను ఎక్కువమంది తమ ఇళ్లలో అలంకరించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. షో రూమ్‌ల ద్వారా వీటికి మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. శిక్షణా కేంద్రాల ద్వారా వీరు ఇతరులకు ఈ విద్యను నేర్పిస్తున్నారు. అయితే ఈ కళాఖండాలు ఎగువ మధ్యతరగతి, ఉన్నత స్థాయి వారే కొనుగోలు చేసే అవకాశం ఉన్న కారణంగా వీటిపై పెద్దఎత్తున మార్కెట్‌ జరుగట్లేదు. కనుక ఈ వృత్తిని ఎంచు కున్న వారు ఇతర వృత్తులపై కూడా ఆధారపడాల్సి వస్తోంది.

బొమ్మల తయారీ, పెయిం టింగ్స్‌లో నిష్ణాతులైన వీరికి రోజు గడవటం కష్టం కావటం తో ఇతర మార్గాలను ఎంచు కున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఖమ్మం జిల్లాలో కార్పెంటర్లుగా జీవనం సాగించారు. విదేశీ ఫర్నీచర్‌ మన దేశానికి దిగుమతి కావటం, రెడీమేడ్‌ ఫర్నీచర్‌ షాపుల సంఖ్య పెరగటంతో వీరి వృత్తి దెబ్బతింది. దీంతో వీరి జీవనం దుర్లభమైంది. ఇదిలా ఉంటే కొందరు హైదరాబాద్‌లో కార్లకు పెయింట్లు వేసే వృత్తిని ఎంచుకున్నారు. గతంలో చేతినిండా పని ఉండేది. ఆధునిక కార్లు రోడ్లమీదికి రావటం, అత్యాధునిక పెయింటింగ్‌ పరికరాలు రంగప్రవేశంతో వీరికి పనుల తగ్గాయి. ఇంకొందరు నెల్లూరుజిల్లాలో టైలర్లుగా స్థిరపడగా రెడీమేడ్‌ షాపులు రాకతో వీరికీ పనులు కరువయ్యాయి.

ఈ విధంగా ఎంచుకున్న ఇతర వృత్తులు కూడా దెబ్బతినడంతో వీని మనగడ అగమ్యగోచరంగా మారింది. దశాబ్దాలుగా వృత్తినే నమ్ముకున్న కారణంగా విద్యపై దృష్టి సారించకపోవటంతో నకాషీలు అన్నింటా వెనుకబడ్డారు. చివరకు మట్టి, రంపపు పొట్టు కలిపి చిన్న చిన్న బొమ్మలు తయారుచేసి రోజులు గడుపుకొస్తున్నారు. అరటి, సీతాఫలం, ఆపిల్‌ వంటి బొమ్మలను తయారుచేసి తోపుడు బండ్లపై అమ్ముటానికి సైతం సిద్దపడినా ప్రయోజనం కనిపించలేదు. ఇటువంటి దుర్బర పరిస్థితిలో జీవనం గడుపుతున్న నకాషీలకు ప్రభుత్వపరంగా సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వం ఆదుకోవాలి
దేశ విదేశాలలో భారతీయ సంసృ్కతిని చాటుతున్న నకాషీ సామాజిక వర్గం దయనీయ స్థితికి చేరకుంటోది కనుక ప్రభుత్వం సహాయం అందించాలని శ్రీ శోమ క్షత్రియ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కేశవరావు కోరుతున్నారు. నకాషీ కులస్తులు తయారుచేసిన బొమ్మలను నేటికీ సంచారంచేసి అమ్ముకుని జీవిస్తుంటారు. కనుక సంచార, పాక్షిక సంచార జాతులను ఏ విధంగా బీసీ- ఏ గ్రూప్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారో అదే విధంగా తమ కులాన్నీ బిసి-బి నుండి మార్చాలంటారు.

తమ సామాజికవర్గం కులవృత్తి చేసుకుందామంటే పొనికి చెక్క దొరకకపోవడంతో ఉపాథి కరువై ఇతర వృత్తులు చేసుకుని రోజులు గడుపుతున్నారని తెలిపారు. కళాకారులకు అందించే పెన్షన్‌ సౌకర్యం తమవారికి కూడా కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు అవుతున్నా తమ సామాజిక వర్గానికి చెందినవారు ఒక్కరు కూడా చట్టసభలలో ప్రవేశించలేదని తెలిపారు. కనీసం ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్‌ పోస్టులను నకాషీ కులస్తులకు కూడా కేటాయించాలని కోరారు.

table

‘కాచి’గూడ వీరిదే

June 15, 2012
DSCN1759 
హైదరాబాద్‌లోని మూసి నది ఒడ్డును పరిశీలిస్తే ‘కాచి’ కులం వారు కనిపిస్తారు. వ్యవసాయం, పూల తోటలను పెం చడం వీరి కుల వృత్తి. వీరి పూర్వీకులు నాలుగు శతాబ్దాల కిం దట బుందేల్‌ ఖండ్‌లోని బల్దోఘడ్‌ నుంచి హైదరాబాద్‌కు వల స వచ్చారు. అప్పట్లో వారు ఛత్రపతి శివాజీ వద్ద సైనికులుగా ఉండేవారు. రాంసింగ్‌ తోప్‌ వీరి మూల పురుషుడు. ఆయన పేరుతోనే కార్వాన్‌లో రాంసింగ్‌పుర ఏర్పడింది. కాగా ఈ కుల స్తులు క్రమంగా కులవృత్తిని కోల్పోయినప్పటికీ ఆ మూలా లను వదులుకోలేకపోతున్నారు. కనుకనే నాలుగడుగుల స్థ లం ఉన్నా కనీసం ఆకుకూరలెైనా పండించి మార్కెట్‌కు పింపి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నారు.వీరి పూర్వీకులు కూరగాయలు పండించి వాటిపెై వచ్చే ఆ దాయంతో జీవించేవారు. ఉత్తర భారత దేశం మొత్తం కాచీ కులస్తులు ఉన్నారు. అయితే వీరు ఎక్కడున్నా నది ఒడ్డును ని వాస ప్రాంతాలుగా ఎంచుకుంటారు. వీరు ఎంచుకున్న నది పరీవాహ ప్రదేశాలు క్రమంగా నగరాలుగా మారిపోవడంతో వీరు జీవనం కోల్పోయారు.

ఫలితంగా ఆర్థికంగా ఎదుగుదల లేక దారిద్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. అదేతీరు మన రా ష్ర్టంలోని కాచీ కులస్తులను చూసినా గమనించవచ్చు. రా్రష్ట రాజధానిలో విస్తరించిన మూసీ నది కూడా వీరి మనుగడకు బాగా తోడ్పడింది. గతంలో మూసీ నదిని ఆసరా చేసుకుని కూరగాయలు పండించి మార్కెట్‌ చేసి జీవనం గడిపేవారు. ఈ కులస్తులు ఎక్కువగా ఉన్న కారణంగానే ఆ ప్రాంతానికి ‘కాచీగూడ’ ఏర్పడింది. అయితే పట్టణం పెరగడం, భూమికి విలువ పెరగడంతో వీరు ఇతర ప్రాంతాలకు నెట్టివేయబ డ్డారు. మన రాష్ర్టంలో 1950లో వచ్చిన యాక్ట్‌ ప్రకారంఆయా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వీరికి 60శాతం భూమి, యజమానికి 40 శాతం భూమి దక్కడంతో వీరు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఏర్పాడింది. వీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో చేతికి వచ్చిన భూమి చేజారి పోయింది. అంటే... 1976లో ఇందిరా గాంధీ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ తీసుకురావడంతో వెయ్యి గజాలకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు జంటనగరాలు మహానగర్‌గా రూపాంతరం చెందడంతో మూసీ నది ఒడ్డు కూడా క్రమంగా కనుమరుగెైంది.

కాలానుగుణంగా జరిగే మార్పుల ప్రభావం వీరిపెైనా పడింది. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవడానికే జాగా దొరకని పరిస్థితుల్లో వీరు కూరగాయలు పండించుకునే చోటు ఎక్కడుంటుంది?. కనుకనే వీరు తమ కుల వృత్తిని కోల్పోయారు. దీనికి తోడు ప్రభుత్వం నందనవనం పేరుతో మూసినదిని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి చర్యలు చేపట్టడంతో వ్యవసాయంపెై కాచీ కులస్తులకున్న ఆశలు అడుగంటాయి. గతంలో తాము పండించిన కూరగాయలను మార్కెట్‌కు చేరవేసేవారు కనుక అక్కడ ఉన్న పరిచయాలతో వీరు కూరగాయలు అమ్ముకునే ప్రయత్నం చేశారు. కనుకనే ఇప్పటికీ కూరగాయల మార్కెట్‌లో వీరు చిరు వ్యాపారులుగా కనిపిస్తుంటారు. కాగా ఇప్పటికీ చాలామంది పాత వృత్తిని మర్చిపోలేకపోతున్నారు. కనుకనే జానెడు జాగా దొరికితే అక్కడే విత్తనాలు చల్లి ఆ భూమిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా కూరగాయలు పండించాలంటే ఎక్కువ కాలం పడుతుంది కనుక ఆకు కూరల మడులపెై మక్కువ పెంచుకున్నారు. కాచి కులంలోని మహిళలు కేజీ 35 రూపాయల చొప్పున మెంతులు కొనుకొస్తారు. వాటిని ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు చిన్న మడిలో వీటిని వేసి పెైన మట్టి చల్లుతారు. మరుసటి రోజుకు చిన్న మొలకలు వస్తాయి. వీటికి మూడు రోజులు నీళ్లు చల్లితే చాలు... అమ్మకానికి మెత్తి కూర రెడీ! అంటే పడిన శ్రమకు ఐదు రోజుల్లో ఫలితం దక్కుతుంది. కనుకనే మూడు కాళ్ల ముసలమ్మలు సైతం లేని శక్తిని కూడదీసుకుని మెంతి కూర పండించి... కట్టలు కట్టి మార్కెట్‌ చేస్తుంటారు. వీరికి ఉండటానికే ఇళ్లులేని కారణంగా మెంతి కూరను రోడ్డు పక్కన కూడా పండిస్తారు. కార్వాన్‌ ప్రాంతంలో 365 రోజుల్లో ఎక్కడో ఒక చోట పచ్చని తివాచీ పరిచినట్టు ఈ ఆకుకూర మడులు రోడ్డు పక్కన కూడా దర్శనమిస్తుంటాయి. వర్షాకా లం మాత్రం భారీ వర్షాలు పడితే మడులు కొంత దెబ్బతిం టాయే తప్ప పూర్తిగా నష్టపోయే పరిస్థితి లేదు కనుక వీరు ఆకు కూరల వరకే పరిమితమైపోయారు.

కాచి కులస్తులు సమన్యాయాన్ని ఇష్టపడతారు. కనుకనే వీరి పెళ్ళిళ్లు, శుభకార్యాలన్నీ వీరి కమ్యూనిటీ హాలులోనే జరి పిస్తారు. ఆ హాలు, అందులో ఉపయోగించుకునే వంట పాత్రలు వంటి వాటికి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవారెైన పప్పు, వెైట్‌ రెైస్‌తో సింపుల్‌గా ఇక్కడే పెళ్ళి జరిపిస్తారు. పెళ్లికి వచ్చినవారు పప్పన్నం తృప్తిగాతిని... వధూవరులను మనసారా ఆశీర్వదించి వెళతారు. అయితే పెళ్లంటే మాత్రం... పెళ్లికొడుకు గుర్రం ఎక్కాల్సిందే. ఎక్కడెైనా ఒకరిద్దరు ఇతర కులస్తులతో పోటీపడి తమ డాబు-దర్పం ప్రదర్శించుకోవాలనుకుంటే పెళ్లయిన నాలుగు రోజుల తర్వాత రిసెప్షన్‌ జరుపుకోవచ్చు. అయితే దానికి ఈ కమ్యూనిటీ హాలు మాత్రం ఇవ్వరు. ఈ తరహా రిసెప్షన్‌లు బహు అరుదుగా జరుగుతాయి. వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉండటంతోపాటు, సమాజంలోని అన్ని వర్గాలతో కలిపి శాంతిని కోరుకుంటారు.

ఖమ్మం, భీమవరం, కైకలూరు, విశాఖ, వరంగల్‌, నల్గొండ తదితరప్రాంతాలలో కూడా కాచి కులస్తులు ఉన్నారు.మహారాష్ర్ట, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌... తదితర రాష్ట్రాల లో వీరి వంశీయులు రాజకీయ నాయకులుగా ఎదిగి మంత్రు లుగా కూడా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా వారిలో మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వహి స్తున్నారు. మహారాష్ర్ట, రాజస్థాన్‌లో ప్రజాప్రతినిధులుగా ప్రధానమైన పోస్టులలో ఉన్నవారూ ఉన్నారు. మన రాష్ర్టంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మొన్నటి ఎన్నికల వరకు కాచి కులస్తులలో ఒక్కరికి కూడా ఆయా పార్టీలు అవకాశం కల్పించలేదు. హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా ఎంఐఎం అవకాశం ఇవ్వటంతో తమ అభ్యర్థిని గెలిపిం చుకున్నారు. ఈ 60 ఏళ్ల చరిత్రలో ఈ ఒక్క కార్పొరేటర్‌ మినహా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయిన వారు ఎవ్వరూ లేరు.

భూమి ేకటారుుంచాలి
img345కాచి కులస్తులకు హైదరాబాద్‌కు వంద కిలోమీటర్లలోపు రెండు వేల ఎకరాల భూమిని ప్ర భుత్వం కేటాయించాలంటారు అఖిల భారత కాచి (కుషువ) మహాసభ ఉపాధ్యక్షుడు కాచి ప్రకా ష్‌. సహజంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం మరొక ప్రదేశంలో భూమి కేటా యిస్తున్న విధంగా వందల సంవత్సరాలుగా తమ కులస్తులు భూమిని నమ్ముకుని బతుకుతు న్నారు కనుక భూమి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. నదీ పరీవాహక ప్రదే శాలు మొదలుకుని నీటి మడుగుల వరకు ఉన్న నీటి వనరులను నమ్ముకుని బతుకుతూ ఇప్పటి కీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కాచి కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి ఏ గ్రూప్‌లోకి మార్చాలం టారు.

డి గ్రూప్‌లో ఉన్న కారణంగా తమకు రిజర్వేషన్‌ ఫలాలు అందట్లేదని చెప్పారు. లేదా నూతనంగా రూపుదిదు ్దకోబోతున్న ఎంబీసీలో తమ కులాన్ని చేర్చాలని కోరుతున్నారు. రాష్ర్టంలో కాచి కులస్తులకు ఏ విధమైన రాజకీయ ప్రాతి నిధ్యం లేదని చెప్పారు. నామినేటెడ్‌ పోస్టులలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నోట్‌
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.com కు మెయిల్‌ చేయవచ్చు లేదా వేణు గోపాల్‌ (ఫోన్‌:960342269) ను సంప్రదించవచ్చు

jkl

‘సాధుచెట్టి’కి ఏదీ గుర్తింపు?

June 19, 2012
రాష్ర్ట విభజన సాధుచెట్టి సామాజికవర్గాన్ని దెబ్బతీసింది. తిరిగి కోలుకుంటున్న దశలో యాంత్రీకరణ, టెక్నాలజీ దెబ్బమీద దెబ్బతీశారుు. దీంతో కునారిల్లుతున్న కులవృత్తి కుదేలరుు్యంది. ఆది నుంచీ మధ్యతరగతి జీవితాలేక పరిమితమైన ఈ కులస్తులు ఎడాపెడా తగులుతున్న దెబ్బలను తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా... ఇప్పటికీ కోలు కోలేకపోయారు. కనుకనే వీరిలో దాదాపు 90 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.

prikaf1fమద్రాసు రాష్ర్టంలో ఆంధ్ర ప్రాంతం అంతర్భాగంగా ఉన్న కాలంలో సాధుచెట్టి కులస్తులు తమిళ... ఆంధ్ర... అనే ప్రాంతీయ బేధం లేకుండా రెండు ప్రాంతాలలో విస్తరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉన్న చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో నివసిస్తున్న సాధుచెట్టి కులంవాళ్లలో ఎక్కువమంది తమిళనాడుకు వెళ్లిపోయారు. కాగా కొందరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే స్థిరపడ్డారు. కనుకనే ఇక్కడ వీరి జనాభా తక్కుగా ఉంది.

అయితే జనాభాపరంగా వీరి జనాభా ఎక్కవశాతం తమిళనాడులో ఉన్న కారణంగా, ఆంధ్రప్రాంతం నుండి వలసవెళ్లినవారు వారితోకలిసి బలమైన శక్తిగా ఎదిగారు. పైగా తమిళనాడులో బడుగుల రాజ్యాధికారమే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న వ్యక్తులకు అక్కడ మంచి గురింపు లభించడంతో బిసీ ఉద్యమం బలం పుంజుకుంది. సాధుచెట్టి సామాజికవర్గానికి చెందివారు కూడా వారితో కలవడం... ఇవన్నీ తమిళనాడులో ఉన్న సాధుచెట్టి సామాజికవర్గానికి తోడవ్వడంతో అక్కడివారు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడినవారు ఈ రాష్ర్టంలో సాధుచెట్టి సామాజికవర్గం ఉందనే గుర్తింపుకు కూడా నోచుకోలేకపోయారు.

వీరి పూర్వీకులు జనపనారతో తాళ్లు, సంచులు, పెరికలు, బోరీలు, తయారుచేసేవారు. సొంత భూములు లేకపోవడంతో జనపనార పండించే రైతుల పొలాలలోని జనుమును ఎకరాల చొప్పున టోకున కొనుగోలు చేసేవారు. ఆ జనుము నుంచి నారను తీసేవారు. ఈ విధంగా తీసిన నారను నీళ్లలో ఒక రాత్రి నానబెట్టి మరుసటి రోజు బండమీద వేసి చెక్కతో మోదేవారు. ఈ విధంగా దాదాపు వారం రోజులు ఇదే విధంగా చేయడంతో నార శుభ్రపడి మెత్తగా తయారయ్యేది. ఆ నారను ‘కదురు’ సాయంతో పేని తాళ్లుగా తయారుచేసేవారు.

ఈ తాళ్లు పేనే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. జనుపనారను చిన్నచిన్న పాయలుగా తీసుకుని తొడపైన పెట్టుకుని పొడవాటి తాడుగా పేనేవారు. ఈ క్రమంలో తొడపైన చేతిరాపిడి కారణంగా చర్మం దెబ్బతిని పుండ్లు పడేవి. దీంతో అటువంటి పుండ్లు పడకుండా ఉండేందుకు తొడపైన అరచేయి వెడల్పున ఉన్న ఇనుపరేకు కట్టుకుని దానిపై నారను పేని తాళ్లను తయారుచేయడం ఆరంభించారు. ఈ విధంగా తయారైన తాళ్లను మగ్గాలపై ఎక్కించి ఒక అడుగు వెడల్పు, 36 ఆడుగుల పొడవున జనపనార తానును తయారుచేసేవారు. దీనినుండి వారికి అవసరమైన సైజులో సంచులు, బోరీలు తయారుచేసేవారు. తయారైన వాటిని గాడిదలు, గుర్రాలపై వేసుకుని ఊరూరా తిరిగి అమ్మేవారు.

పంటలు ఇంటికి చేరే సమయంలో ధాన్యం నింపడానికి గోనె సంచులు అవసరం కావడంతో రైతాంగం వీరిని ఆశ్రయించేది. దీంతో వీరికి చేతినిండా పనే. అయితే ప్లాస్టిక్‌ సంచులు మార్కెట్‌లోకి రావడం, జనుము పండించేవారు తగ్గిపోవటంతో వీరు ఉపాధి కోల్పోయారు. దీనికితోడు వీరికి సొంత భూములు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో వీరంతా వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. రాష్ర్టంలోని బిసి రిజర్వేషన్లలో బి గ్రూప్‌లో గుర్తించబడిన పురగిరి క్షత్రియగా పిలువబడుతున్న పెరిక కులస్తులతో వీరికి సత్‌ సంబంధాలు ఉన్నాయి.

కనుకనే ఇప్పటికీ రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాలలో వీరికి పెరిక కులస్తులుగా అధికారులు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో బలిజ అని కూడా కుల సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే తమకంటూ ఒక కులం ఉంది కనుక... తమ కులం పేరుతోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేది వీరి వాదన. కాగా సాధుచెట్టి కులంపేరుతో అధికారులు కుల ధృవీకరణ పత్రాలు విడుదల చేయకపోవడంతో ఈ సామాజికవర్గంవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యపట్ల వీరికి శ్రద్ధ ఉన్నప్పటికీ కేవలం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వీరిలో అక్షరాస్యత శాతం కూడా తగ్గింది.

ప్రస్తుతం వీరిలో ఎనిమిది శాతానిి మించి విద్యావంతులు లేరు. సామాజికంగా చూస్తే కూడా వీరిలో పది ఎకరాల భూమి కలిగిన వారిని వెళ్లమీద లెక్కించవచ్చు. ఎక్కువ భాగం భూమిలేని నిరుపేదలే. పూర్వం నుంచి వీరు సంచార జీవులుగా జీవనం సాగించడంతో ఆ ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధంగా సాధుచెట్టి కులస్తులు అన్ని రంగాలలో వెనుకబడే ఉన్నారు. ప్రభుత్వపరంగా ప్రకటిస్తోన్న పథకాలు కూడా వీరి దరి చేరట్లేదు. కనీసం వీరికి వాటిపై అవగాహన కూడా లేకపోవటం గమనార్హం.

ప్రభుత్వం ఆదుకోవాలి
timmana-ramanaకుల వృత్తి కోల్పోయి ఉపాధి కరవై దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న తమ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటారు సాధుచెట్టి సంఘం అధ్యక్షుడు టి. రమణ. బీసీలుగా తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ వాటి ఫలాలు తమ దరిచేరట్లేదంటారు. కనుక బీసీలకు ప్రభుత్వరం గంతోపాటు ప్రైవేటురంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. తమ కులస్తులకు సొంత ఇళ్లు లేకపోవడంతో శుభకార్యాలు జరుపుకోవ డానికి నానా యాతనలు పడుతున్నారనీ ఈ నేపథ్యంలో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుం దంటారు. సాధుచెట్టి కులస్తులు జనాభాప రంగా తక్కువ సంఖ్యలో ఉన్నారు కనుకనే రాజకీయ ప్రాధాన్యతకు నోచుకోలేపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన రాజకీయ ప్రాధాన్యత లేని కారణంగా తమ సామాజికవర్గ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని చెప్పారు. కనీసం నామినేటెడ్‌ పోస్టుల లోనైనా తమవారికి అవకాశం కల్పిం చాలని కోరారు.
table

పట్ర..ప్రాంతానీకొక వృత్తి


IMG_1994 
మన రాష్ర్టంలోని ‘పట్ర’ అనే సామాజికవర్గం కాలానుగుణంగా కుల వృత్తిని మార్చుకుంటు మనుగడ సాగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమం లో వీరు ఏ ప్రాంతంలో ఉంటే తమకు అనుకూలగా ఉన్న వృత్తులను ఎం చుకున్నారు. పట్ర కులస్తులు నివాసాలుగా ఎంచు కున్న ప్రాంతాలు సై తం విలక్షణంగా ఉంటాయి. గుంటూరు జిల్లాల మొదలు చిత్తూరు జిల్లా వరకు కొండలు, అడవులే వీరి ఆవాసాలు. గిరిపుత్రులుగా జీవనం సాగి స్తున్న వీరు ఎంతోకాలంగా ఎటువంటి రిజర్వేషన్‌ సౌకర్యం లేకుండా మ నుగడ సాగించారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2008లో బిసి రిజ ర్వేషన్‌ సౌకర్యం పొందారు. కాగా ఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరం గానే జీవిస్తున్నారు.1901లో మద్రాసు రాష్ర్ట జనగణనలో ఈ కులాన్ని గురించి వివరణ ఉంది. తెలుగు మాట్లాడే ‘పట్ర’ కులస్తులను వేటగాళ్లు, వ్యవసాయదా రులని పేర్కొంది.

అప్పట్లో అనంతపురం జిల్లా ఏర్పడలేదు. కనుక ప్రధా నంగా కడప, కర్నూలు జిల్లాలలో నివసించేవారిగా చూపింది. పట్ర కుల స్తులు ఒరిస్సా నుంచి వలస వచ్చినవారు కావడంతో నేటికీ వారి మాతృ భాషను మర్చిపోలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఒరియా భాష మాట్లాడే పట్ర కులస్తులను ఇప్పటికీ చూడొచ్చు. అక్కడ వేల సంఖ్యలో జీవిస్తున్న వీరు ‘ఒరియా మాట్లాడే వట్ర వీవర్స్‌ అసోసియేషన్‌’ అనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కర్నాటక రాష్ర్టంలో చిత్తూరు సరిహద్దు నుంచి బెంగుళూరు వరకు, కొంతమేర తమిళనాడు లో కూడా వీరిని చూడొచ్చు.
చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు విస్తరించిన నల్లమల్ల అడ వులను, గుట్టలను ఆధారం చేసుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. తొలి రోజుల్లో కొండకోనల్లో వేటగాళ్లగా జీవనం సాగిస్తున్న వీరిలో కొందరు మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలోని కం చిలి, అనంతపురం జిల్లాలోని ధర్మవరం ప్రాంతాలలో కొందరు స్థిరపడ్డా రు. వీరు పట్టు దారాలతో వస్త్రాలు తయారుచేసేవారు. కనుకనే ఆ ప్రాం తాలు మినహా మరెక్కడా వీరు మగ్గం పట్టిన దాఖలాలులేవు.

ఇక ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం తదితర కొండ, అటవీప్రాం తాలలో దొరికే ఉత్పత్తులపెై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. వేటగాళ్లుగా, రెైతు కూలీలుగా కూడా వీరు కనిపిస్తారు. కడప జిల్లాలోని పులివెందులలో స్వ ర్ణకారులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలో కాపు సారా కాస్తుం టారు. ప్రాంతానికి ఒక వృత్తి ఎంచుకోవటంతో వీరు ఏకం కాలేకపో యా రు. భిన్న వృత్తులు వీరిని మరింత దూరం చేశాయనే చెప్పొచ్చు. ఈ క్ర మంలో వీరు ఎన్ని వృత్తులను ఎంచుకున్నా అవన్నీ ఆర్థికంగా అభివృద్ది చెందడానికి దోహదపడలేదు. దీంతో నేటికీ దయనీయ స్థితిలోనే రోజులు గడుపుతున్నారు. పట్ర సామాజికవర్గంలో సొంత భూమి ఉన్నవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. నాటి బిసి కమిషన్‌ చెైర్మన్‌ డి సుబ్రమణ్యం వీరి దుస్థితిని స్వయంగా చూశారు. కనుకనే వీరి కులానికి న్యా యం జరగా లంటే ఎస్టీ జాబితాలో చేర్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రిజర్వేషన్‌ జాబితాలో పట్ర కులాన్ని చేర్పించేందుకు వీరు పడిన శ్రమ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1968 వరకు బిసి రిజర్వేషన్‌ జాబితాలో ఉన్న వీరి కులాన్ని అనంతరామన్‌ కమిషన్‌ తొలగిస్తే 40 ఏళ్ల పాటు సుదీ ర్ఘపోరాటం చేసి సాధించుకున్న ఘనత వీరికే చెందుతుంది. అనం తరామన్‌ కమిషన్‌ విచారణ ఫలితంగా పట్ర కులం బిసి జాబితా నుండి 1968లో తొలగించబడింది. కాగా అనంతరామన్‌ కమిషన్‌ అసమగ్ర విచారణ చేసిందంటూ పట్ర కులస్తులు 1974లో మురళీధరరావు కమి షన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫలితంగా 1986లో ఎన్‌టి ఆర్‌ ప్రభుత్వం వీరిని బిసీ-డిలో చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం చేసిన పొరపాటు కారణంగా జీఓ చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అయినా వీరు పట్టువీడలేదు. పరిచయం ఉన్న ప్రతినాయకుడినీ పట్టుకున్నారు.

ఫలితంగా కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1994లో బిసీ జాబితాలో వీరిని చేర్చారు. కాగా ఒక బీసీ నాయకుడు కోర్టుకు వెళ్లటంతో కథ మళ్లీ మొదటికి వచ్చిం ది. అయినా పట్ర నాయకులు నీరుత్సాహపడలేదు, ప్రయత్నాలూ ఆప ేదు. 1998 వరకు జస్టిస్‌ పుట్టుస్వామిని కలిసి అనేకసార్లు వివరించారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ బిసీ కమిషన్‌ బెంచ్‌ జస్టిస్‌ బిఎల్‌ యాదవ్‌ను సైతం కలిశారు. ఎటువంటి ఫలితం లేకపో యినా జాతీయ కమిషన్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు మాత్రం ఆపలేదు. 2002లో కమిషన్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో వీరు కలిసి వివరిం చిన ఫలితంగా 2004లో ఆంధ్రప్రదేశ్‌ ఓబిసీ జాబితాలో సీరియల్‌ నంబ ర్‌ 105లో పట్ర కులాన్ని చేరుస్తూ గెజిట్‌ విడుదలెైంది. వీరు చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్రోత్సాహం ఇచ్చింది. దీంతో వీరి ప్రయత్నా లు ముమ్మరం చేయడంతో... ఆ కృషి ఫలించి నాటి రాష్ర్ట బిసీ కమిషన్‌ చెైర్మన్‌ జస్టిస్‌ డి సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం కడప, అనంతపు రం జిల్లాలలోని పట్ర కులస్తుల జీవనశెైలిని పరిశీలించింది.

ఈ నేపథ్యం లో బిసి-ఏ గ్రూప్‌లో వీరిని చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎట్టకేలకు పట్ర కులాన్ని బిసి- ఏ గ్రూప్‌లో చేరుస్తూ జీఓ విడుదల అయ్యింది. అయితే వీరిలో ఎక్కుక మంది కొండకోనలను నమ్ముకుని జీవించడంతో ఈ రిజర్వేషన్ల ఫలాలను అక్కడివారు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనికితోడు అక్షరా స్యుల సంఖ్య కూడా తక్కువ కావడం మరో కారణం. దీంతో నేటికీ దయనీయ స్థితిలోనే రోజులు గడుపుతున్నారు.

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి;
sri-ramluఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరంగానే జీవి స్తున్న తమ సామాజికవర్గాన్ని ఆదుకోవడానికి ప్రభు త్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ పట్ర సం క్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఏ శ్రీరాము లు కోరుతు న్నారు. మైదాన ప్రాంతం చేరుకున్న వారిలో కొందరు విద్యావంతు లెైనప్పటికీ పట్ర కులస్తుల జీవనశెైలి అనాగరికం గా ఉందంటున్నారు. ఈ క్రమంలో పట్ర కులస్తులను త్వరలో ప్రకటించనున్న ఎంబిసి జాబితాలో చేర్చితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు.

అనేక కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విధంగా తమ కులానికీ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వివిధ వృత్తులలో ఉన్న పట్ర కులం వారికి చేయూత ఇవ్వాలని కోరారు.అణగారినవర్గంగాను, కొండకో నల్లో ఉంటున్నవారిగా జీవిస్తున్న తమ కు ప్రభుత్వ పథకాలు కూడా దరిచేర ట్లేదని విచారం వ్యక్తం. తమ సామాజిక వర్గం విద్యాపరంగా వెనుకపడింది కనుకనే స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటుతున్నా ప్రభుత్వపరంగా అందుతున్న ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నోట్: బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను షషష.రతీవ.శీఎకు మెరుుల్‌ చేయవచ్చు లేదా వేణుగోపాల్‌ (ఫోన్‌: 9603462269) ను సంప్రదించవచ్చు

hjg

ఆ నియామకం చెల్లదు












డీజీపీగా దినేష్‌రెడ్డి ఎంపికపై క్యాట్ సంచలన తీర్పు
‘సుప్రీం’ తీర్పునకు విరుద్ధంగా ఆయన్ను ఎంపిక చేశారు
అర్హులైన వారి జాబితాను వారం రోజుల్లో యూపీఎస్‌సీకి పంపాలి... మూడు వారాల్లో నూతన డీజీపీ నియామకాన్ని పూర్తి చేయాలని సర్కారుకు ఆదేశం

హైదరాబాద్, న్యూస్‌లైన్: డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) సంచలన తీర్పు వెలువరించింది. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా దినేష్‌రెడ్డిని డీజీపీగా ఎంపిక చేశారని క్యాట్ పేర్కొంది. నూతన డీజీపీ నియామకాన్ని మూడు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్యాట్ మంగళవారం ఆదేశించింది. డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల జాబితాను వారం రోజుల్లో యూపీఎస్‌సీకి పంపాలని స్పష్టం చేసింది. ఈ జాబితాలో అర్హులైన ముగ్గురిని గుర్తించి యూపీఎస్‌సీ ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. యూపీఎస్‌సీ జాబితా అందిన వారం రోజుల్లో నూతన డీజీపీ నియామకాన్ని పూర్తిచేయాలని రాష్ట్ర సర్కారుకి జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే నూతన డీజీపీ నియామకం చేపట్టే వరకూ డీజీపీగా దినేష్‌రెడ్డి విధులు నిర్వహించేందుకు క్యాట్ అనుమతించింది.

డీజీపీగా దినేష్ నియామకం చట్టవిరుద్ధమంటూ గత ఏడాది జూలై 12న హోంశాఖ ముఖ్య కార్యదర్శి పి.గౌతంకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను రణబీర్‌సింగ్, కాంతయ్యలతో కూడిన క్యాట్ ధర్మాసనం విచారించిన అనంతరం ఈ మేరకు తీర్పును వెలువరించింది. డీజీపీ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పదేపదే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, 2009 నుంచి ముగ్గురు డీజీపీల ఎంపికలో సుప్రీంకోర్టు, హైకోర్టు, క్యాట్ తీర్పులను.. ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ గౌతంకుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రకాష్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని గౌతంకుమార్ తరఫు న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. గిరీష్‌కుమార్, అరవిందరావులను డీజీపీగా ఎంపిక చేసినప్పుడు కూడా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని, ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ క్యాట్, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ధిక్కరించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్‌సీకి పంపాలని, వారు సూచించిన అధికారుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేయాలని వివరించారు.

ఉమేష్ సస్పెన్షన్







డీజీ స్థాయి అధికారిపై వేటు ఇదే ప్రథమం
ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో ఉమేష్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
మూడ్రోజులుగా కనిపించకుండాపోయిన ఐపీఎస్ అధికారి
చర్యలకు డీజీపీ సిఫారసు, ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: గోదావరి వ్యాలీ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేదీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా హైదరాబాద్ వదలి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలో డెరైక్టర్ జనరల్ స్థాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేయటం ఇదే ప్రథమం. ఉమేష్‌కుమార్ సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్ర పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1977 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఉమేష్‌కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో డీజీపీ పోస్టు కోసం పోటీపడ్డారు. డీజీపీ పోస్టుకు అప్పుడు పోటీలో ఉన్న దినేష్‌రెడ్డి, ఆయన భార్య పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ సంతకం ఫోర్జరీ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు పంపినట్లు ఉమేష్‌కుమార్‌పై ఆరోపణలున్నాయి.

ఎంపీ ఎం.ఎ.ఖాన్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ గత ఏడాది కేసు నమోదుచేసింది. ఫోర్జరీ కేసులో ఉమేష్‌కుమార్‌పై సీఐడీ నాంపల్లి కోర్టులో అభియోగపత్రాన్ని కూడా దాఖలుచేసింది. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఉమేష్‌కుమార్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీచేయడంతో శుక్రవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. వారంట్ కాపీలను అందిచేందుకు వెళితే ఉమేష్ పరారయ్యారని, ఉద్దేశపూర్వకంగానే తప్పించుకున్నారని సీఐడీ డీఎస్‌పీ అమర్‌కాంత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఉమేష్ సచివాలయంలోని ఆయన కార్యాలయానికి కూడా రాలేదు. సీఐడీ అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారని, తీవ్రమైన దుష్ర్పవర్తన కలిగి ఉన్నందున ఆయనను సస్పెండ్ చేయాలని డీజీపీ దినేష్‌రెడ్డి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరుకావటంపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఉమేష్‌కుమార్ శనివారం నుంచి విధులకు హాజరుకావటంలేదని, ముందస్తు సమాచారం అందించలేదని సాధారణ పరిపాలన విభాగం అధికారులు సీఎం కార్యాలయానికి నివేదిక అందించారు. ఆ నివేదికను సీఎం కిరణ్ పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉమేష్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.