June 19, 2012
రాష్ర్ట విభజన సాధుచెట్టి సామాజికవర్గాన్ని
దెబ్బతీసింది. తిరిగి కోలుకుంటున్న దశలో యాంత్రీకరణ, టెక్నాలజీ దెబ్బమీద
దెబ్బతీశారుు. దీంతో కునారిల్లుతున్న కులవృత్తి కుదేలరుు్యంది. ఆది నుంచీ
మధ్యతరగతి జీవితాలేక పరిమితమైన ఈ కులస్తులు ఎడాపెడా తగులుతున్న దెబ్బలను
తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా... ఇప్పటికీ కోలు కోలేకపోయారు. కనుకనే
వీరిలో దాదాపు 90 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.
అయితే జనాభాపరంగా వీరి జనాభా ఎక్కవశాతం తమిళనాడులో ఉన్న కారణంగా, ఆంధ్రప్రాంతం నుండి వలసవెళ్లినవారు వారితోకలిసి బలమైన శక్తిగా ఎదిగారు. పైగా తమిళనాడులో బడుగుల రాజ్యాధికారమే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న వ్యక్తులకు అక్కడ మంచి గురింపు లభించడంతో బిసీ ఉద్యమం బలం పుంజుకుంది. సాధుచెట్టి సామాజికవర్గానికి చెందివారు కూడా వారితో కలవడం... ఇవన్నీ తమిళనాడులో ఉన్న సాధుచెట్టి సామాజికవర్గానికి తోడవ్వడంతో అక్కడివారు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడినవారు ఈ రాష్ర్టంలో సాధుచెట్టి సామాజికవర్గం ఉందనే గుర్తింపుకు కూడా నోచుకోలేకపోయారు.
వీరి పూర్వీకులు జనపనారతో తాళ్లు, సంచులు, పెరికలు, బోరీలు, తయారుచేసేవారు. సొంత భూములు లేకపోవడంతో జనపనార పండించే రైతుల పొలాలలోని జనుమును ఎకరాల చొప్పున టోకున కొనుగోలు చేసేవారు. ఆ జనుము నుంచి నారను తీసేవారు. ఈ విధంగా తీసిన నారను నీళ్లలో ఒక రాత్రి నానబెట్టి మరుసటి రోజు బండమీద వేసి చెక్కతో మోదేవారు. ఈ విధంగా దాదాపు వారం రోజులు ఇదే విధంగా చేయడంతో నార శుభ్రపడి మెత్తగా తయారయ్యేది. ఆ నారను ‘కదురు’ సాయంతో పేని తాళ్లుగా తయారుచేసేవారు.
ఈ తాళ్లు పేనే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. జనుపనారను చిన్నచిన్న పాయలుగా తీసుకుని తొడపైన పెట్టుకుని పొడవాటి తాడుగా పేనేవారు. ఈ క్రమంలో తొడపైన చేతిరాపిడి కారణంగా చర్మం దెబ్బతిని పుండ్లు పడేవి. దీంతో అటువంటి పుండ్లు పడకుండా ఉండేందుకు తొడపైన అరచేయి వెడల్పున ఉన్న ఇనుపరేకు కట్టుకుని దానిపై నారను పేని తాళ్లను తయారుచేయడం ఆరంభించారు. ఈ విధంగా తయారైన తాళ్లను మగ్గాలపై ఎక్కించి ఒక అడుగు వెడల్పు, 36 ఆడుగుల పొడవున జనపనార తానును తయారుచేసేవారు. దీనినుండి వారికి అవసరమైన సైజులో సంచులు, బోరీలు తయారుచేసేవారు. తయారైన వాటిని గాడిదలు, గుర్రాలపై వేసుకుని ఊరూరా తిరిగి అమ్మేవారు.
పంటలు ఇంటికి చేరే సమయంలో ధాన్యం నింపడానికి గోనె సంచులు అవసరం కావడంతో రైతాంగం వీరిని ఆశ్రయించేది. దీంతో వీరికి చేతినిండా పనే. అయితే ప్లాస్టిక్ సంచులు మార్కెట్‌లోకి రావడం, జనుము పండించేవారు తగ్గిపోవటంతో వీరు ఉపాధి కోల్పోయారు. దీనికితోడు వీరికి సొంత భూములు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో వీరంతా వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. రాష్ర్టంలోని బిసి రిజర్వేషన్లలో బి గ్రూప్‌లో గుర్తించబడిన పురగిరి క్షత్రియగా పిలువబడుతున్న పెరిక కులస్తులతో వీరికి సత్ సంబంధాలు ఉన్నాయి.
కనుకనే ఇప్పటికీ రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాలలో వీరికి పెరిక కులస్తులుగా అధికారులు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో బలిజ అని కూడా కుల సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే తమకంటూ ఒక కులం ఉంది కనుక... తమ కులం పేరుతోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేది వీరి వాదన. కాగా సాధుచెట్టి కులంపేరుతో అధికారులు కుల ధృవీకరణ పత్రాలు విడుదల చేయకపోవడంతో ఈ సామాజికవర్గంవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యపట్ల వీరికి శ్రద్ధ ఉన్నప్పటికీ కేవలం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వీరిలో అక్షరాస్యత శాతం కూడా తగ్గింది.
ప్రస్తుతం వీరిలో ఎనిమిది శాతానిి మించి విద్యావంతులు లేరు. సామాజికంగా చూస్తే కూడా వీరిలో పది ఎకరాల భూమి కలిగిన వారిని వెళ్లమీద లెక్కించవచ్చు. ఎక్కువ భాగం భూమిలేని నిరుపేదలే. పూర్వం నుంచి వీరు సంచార జీవులుగా జీవనం సాగించడంతో ఆ ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధంగా సాధుచెట్టి కులస్తులు అన్ని రంగాలలో వెనుకబడే ఉన్నారు. ప్రభుత్వపరంగా ప్రకటిస్తోన్న పథకాలు కూడా వీరి దరి చేరట్లేదు. కనీసం వీరికి వాటిపై అవగాహన కూడా లేకపోవటం గమనార్హం.
ప్రభుత్వం ఆదుకోవాలి
No comments:
Post a Comment