Tuesday 19 June 2012

‘సాధుచెట్టి’కి ఏదీ గుర్తింపు?

June 19, 2012
రాష్ర్ట విభజన సాధుచెట్టి సామాజికవర్గాన్ని దెబ్బతీసింది. తిరిగి కోలుకుంటున్న దశలో యాంత్రీకరణ, టెక్నాలజీ దెబ్బమీద దెబ్బతీశారుు. దీంతో కునారిల్లుతున్న కులవృత్తి కుదేలరుు్యంది. ఆది నుంచీ మధ్యతరగతి జీవితాలేక పరిమితమైన ఈ కులస్తులు ఎడాపెడా తగులుతున్న దెబ్బలను తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నా... ఇప్పటికీ కోలు కోలేకపోయారు. కనుకనే వీరిలో దాదాపు 90 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.

prikaf1fమద్రాసు రాష్ర్టంలో ఆంధ్ర ప్రాంతం అంతర్భాగంగా ఉన్న కాలంలో సాధుచెట్టి కులస్తులు తమిళ... ఆంధ్ర... అనే ప్రాంతీయ బేధం లేకుండా రెండు ప్రాంతాలలో విస్తరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉన్న చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో నివసిస్తున్న సాధుచెట్టి కులంవాళ్లలో ఎక్కువమంది తమిళనాడుకు వెళ్లిపోయారు. కాగా కొందరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే స్థిరపడ్డారు. కనుకనే ఇక్కడ వీరి జనాభా తక్కుగా ఉంది.

అయితే జనాభాపరంగా వీరి జనాభా ఎక్కవశాతం తమిళనాడులో ఉన్న కారణంగా, ఆంధ్రప్రాంతం నుండి వలసవెళ్లినవారు వారితోకలిసి బలమైన శక్తిగా ఎదిగారు. పైగా తమిళనాడులో బడుగుల రాజ్యాధికారమే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న వ్యక్తులకు అక్కడ మంచి గురింపు లభించడంతో బిసీ ఉద్యమం బలం పుంజుకుంది. సాధుచెట్టి సామాజికవర్గానికి చెందివారు కూడా వారితో కలవడం... ఇవన్నీ తమిళనాడులో ఉన్న సాధుచెట్టి సామాజికవర్గానికి తోడవ్వడంతో అక్కడివారు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడినవారు ఈ రాష్ర్టంలో సాధుచెట్టి సామాజికవర్గం ఉందనే గుర్తింపుకు కూడా నోచుకోలేకపోయారు.

వీరి పూర్వీకులు జనపనారతో తాళ్లు, సంచులు, పెరికలు, బోరీలు, తయారుచేసేవారు. సొంత భూములు లేకపోవడంతో జనపనార పండించే రైతుల పొలాలలోని జనుమును ఎకరాల చొప్పున టోకున కొనుగోలు చేసేవారు. ఆ జనుము నుంచి నారను తీసేవారు. ఈ విధంగా తీసిన నారను నీళ్లలో ఒక రాత్రి నానబెట్టి మరుసటి రోజు బండమీద వేసి చెక్కతో మోదేవారు. ఈ విధంగా దాదాపు వారం రోజులు ఇదే విధంగా చేయడంతో నార శుభ్రపడి మెత్తగా తయారయ్యేది. ఆ నారను ‘కదురు’ సాయంతో పేని తాళ్లుగా తయారుచేసేవారు.

ఈ తాళ్లు పేనే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. జనుపనారను చిన్నచిన్న పాయలుగా తీసుకుని తొడపైన పెట్టుకుని పొడవాటి తాడుగా పేనేవారు. ఈ క్రమంలో తొడపైన చేతిరాపిడి కారణంగా చర్మం దెబ్బతిని పుండ్లు పడేవి. దీంతో అటువంటి పుండ్లు పడకుండా ఉండేందుకు తొడపైన అరచేయి వెడల్పున ఉన్న ఇనుపరేకు కట్టుకుని దానిపై నారను పేని తాళ్లను తయారుచేయడం ఆరంభించారు. ఈ విధంగా తయారైన తాళ్లను మగ్గాలపై ఎక్కించి ఒక అడుగు వెడల్పు, 36 ఆడుగుల పొడవున జనపనార తానును తయారుచేసేవారు. దీనినుండి వారికి అవసరమైన సైజులో సంచులు, బోరీలు తయారుచేసేవారు. తయారైన వాటిని గాడిదలు, గుర్రాలపై వేసుకుని ఊరూరా తిరిగి అమ్మేవారు.

పంటలు ఇంటికి చేరే సమయంలో ధాన్యం నింపడానికి గోనె సంచులు అవసరం కావడంతో రైతాంగం వీరిని ఆశ్రయించేది. దీంతో వీరికి చేతినిండా పనే. అయితే ప్లాస్టిక్‌ సంచులు మార్కెట్‌లోకి రావడం, జనుము పండించేవారు తగ్గిపోవటంతో వీరు ఉపాధి కోల్పోయారు. దీనికితోడు వీరికి సొంత భూములు లేకపోవటంతో సమస్య మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో వీరంతా వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. రాష్ర్టంలోని బిసి రిజర్వేషన్లలో బి గ్రూప్‌లో గుర్తించబడిన పురగిరి క్షత్రియగా పిలువబడుతున్న పెరిక కులస్తులతో వీరికి సత్‌ సంబంధాలు ఉన్నాయి.

కనుకనే ఇప్పటికీ రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాలలో వీరికి పెరిక కులస్తులుగా అధికారులు కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో బలిజ అని కూడా కుల సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే తమకంటూ ఒక కులం ఉంది కనుక... తమ కులం పేరుతోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేది వీరి వాదన. కాగా సాధుచెట్టి కులంపేరుతో అధికారులు కుల ధృవీకరణ పత్రాలు విడుదల చేయకపోవడంతో ఈ సామాజికవర్గంవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యపట్ల వీరికి శ్రద్ధ ఉన్నప్పటికీ కేవలం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో వీరిలో అక్షరాస్యత శాతం కూడా తగ్గింది.

ప్రస్తుతం వీరిలో ఎనిమిది శాతానిి మించి విద్యావంతులు లేరు. సామాజికంగా చూస్తే కూడా వీరిలో పది ఎకరాల భూమి కలిగిన వారిని వెళ్లమీద లెక్కించవచ్చు. ఎక్కువ భాగం భూమిలేని నిరుపేదలే. పూర్వం నుంచి వీరు సంచార జీవులుగా జీవనం సాగించడంతో ఆ ప్రభావం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధంగా సాధుచెట్టి కులస్తులు అన్ని రంగాలలో వెనుకబడే ఉన్నారు. ప్రభుత్వపరంగా ప్రకటిస్తోన్న పథకాలు కూడా వీరి దరి చేరట్లేదు. కనీసం వీరికి వాటిపై అవగాహన కూడా లేకపోవటం గమనార్హం.

ప్రభుత్వం ఆదుకోవాలి
timmana-ramanaకుల వృత్తి కోల్పోయి ఉపాధి కరవై దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న తమ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటారు సాధుచెట్టి సంఘం అధ్యక్షుడు టి. రమణ. బీసీలుగా తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ వాటి ఫలాలు తమ దరిచేరట్లేదంటారు. కనుక బీసీలకు ప్రభుత్వరం గంతోపాటు ప్రైవేటురంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. తమ కులస్తులకు సొంత ఇళ్లు లేకపోవడంతో శుభకార్యాలు జరుపుకోవ డానికి నానా యాతనలు పడుతున్నారనీ ఈ నేపథ్యంలో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుం దంటారు. సాధుచెట్టి కులస్తులు జనాభాప రంగా తక్కువ సంఖ్యలో ఉన్నారు కనుకనే రాజకీయ ప్రాధాన్యతకు నోచుకోలేపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన రాజకీయ ప్రాధాన్యత లేని కారణంగా తమ సామాజికవర్గ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని చెప్పారు. కనీసం నామినేటెడ్‌ పోస్టుల లోనైనా తమవారికి అవకాశం కల్పిం చాలని కోరారు.
table

No comments:

Post a Comment