Tuesday 19 June 2012

‘నార’ పోయింది ‘నారు’ మిగిలింది


June 4, 2012
పెఱిక... ఇది కులం పేరు అయినప్పటికీ, ఇదొక వస్తువు! ఇది ఎలా ఉంటుందో... చూద్దామన్నా ప్రస్తుత కాలంలో కనిపించదు!! మ్యూజియంలో కాదుకదా... బొమ్మల్లో కూడా మనకు దర్శనమివ్వదు !!! జనపనారతో తయారు చేసే పెఱిక కొన్ని దశాబ్దాల కిందటే కనుమరు గయ్యింది. అయితే పెఱికను తయారు చేసేవారు సమాజంలో ఇప్పటికీ పెఱిక కులస్థులుగా గుర్తింపుపొందు తున్నారు. ఈ వృత్తి దెబ్బతినడంతో అనుబంధ వృత్తి గోనె సంచుల తయారీని ఎంచుకు న్నారు. అదీ దెబ్బతింది. దీంతో ఎక్కువ మంది వ్యవసాయం వెైపు మళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నార’ పోయిందీ... ‘నారు’ మిగిలింది!

prika0రాష్ర్టంలో వీరు పెఱిక, పెఱిక బలిజ, పురగిరి క్షత్రియగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లాలో వీరికి అక్కడి వారు ‘రెడ్డి’ అని గౌరవంగా పిలుస్తారు. వీరు నిజా మాబాద్‌, నల్గొండ, వరంగల్‌, ఆదిలాబాద్‌, జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మి గతా జిల్లాలలో అక్కడక్కడా కనిపిస్తారు. విజయనగం, శ్రీకాకుళం జిల్లాలలో కూ డా వీరు ఉన్నారు. అయితే తెలంగాణ జిల్లాలలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు.పెఱిక గురించి ఇప్పటి తరానికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే... ధాన్యం తరలిం చడానికి గాడిదపెై వేసిన గోనె సంచి అని చెప్పొచ్చు. ఈ సంచులను వీరే ప్రత్యేకం గా తయారు చేస్తారు. ఈ సంచిని గాడిద వీపుపెై వేస్తే రెండు వెైపుల నుండి ధాన్యం పోసుకునే అవకాశం ఉంటుంది. దున్నపోతులు, గాడిదలు, గుర్రాలు...

తదితర జంతువుల వీపులపెై పూర్వ కాలం పెఱికల్లో ధాన్యం, అపరాలు నింపి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అప్పట్లో ఎడ్లబండ్లపెై వేసుకుని తీసుకుపొయే అంత సరు కులేని వారు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వీరి సేవలు మన పూర్వీకులందరూ దాదాపుగా ఉపయోగించుకున్నారనేనని చెప్పొచ్చు. కనుక గ్రామాలలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వీరు సంచార జీవులు. పెఱికలు ఎక్కడ అవసవమైతే అక్కడ పెద్ద సంఖ్యలో వీరు వెళ్లి తయారు చేసివస్తారు. అయితే ఎంత దూరం ప్రయాణించినా స్వగ్రామాన్ని మాత్రం మర్చి పోయేవారు కాదు. తాము తయారు చేసివ పెఱికలను మార్కెట్‌ చేయడానికి దగ్గర్లో ఉన్న గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసి తిరిగి స్వగ్రామం చేరుకునేవారు. పెఱిక తయారు చేసే సందర్భంగా జనపనార నుంచి వచ్చే నుసి వలన శ్వాశకోశ వ్యాధుల బారిన పడేవారు.

ఈ సందర్భంలో వీరే స్వయంగా ఆయుర్వేద ఔషథాలను తయా రు చేసుకునేవారు. పెఱికలు తయారు చేయడానికి అప్పట్లో జనుము, గోగులను పెంచి వాటి నుండి నారను వీరే స్వయంగా తీసేవారు. ఈ నార తీసే విధానాన్ని గమ నిస్తే వాళ్లు ఎంతగా శ్రమిస్తారో అర్థమవుతుంది. నార తీయటానికి వీరు ప్రత్యేకం గా ఎంచుకున్న మొ క్కలను ఆరు అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెంచుతారు. అవి బాగా ముదిరాక... వాటిని కోసి చిన్న చిన్న కట్టలుగా కట్టి నీళ్లలో నానాబెడతారు. దాదాపు వారం పది రోజులపాటు నానబెట్టిన ఈ చెట్టనుంచి నారను వేరుచేసి శు భ్రం చేసి ఎండబెట్టేవారు. అటువంటి నా రతో వీరు ఈ పెఱికలు తయారు చేసేవా రు. వీటిని మగ్గాలపెైన కూడా నేసేవారు.

వీ టితోపాటు పెద్ద పెద్ద బోరీలు కూడా తయారు చేసేవారు. అంతేకాదు... తాళ్లు కూడా పేనేవారు. ఇవి మరింత మన్నికగా, దృఢంగా ఉండేందుకు చిం తపిక్కల పొడిని ఉపయోగించేవారు. అంటే... చిం తపిక్కలను పొడిచేసి ఉడికించి చిక్కటి ద్రవాన్ని తయారు చేసేవారు. ఈ ద్రవంలో వారు తయారు చేసిన తాళ్లను ముంచేవారు. దీంతో సన్నటి తాళ్లు కూడా పటిష్టం గా తయారయ్యేవి. ఈ తాళ్లతో 20 మీటర్ల విస్తీర్ణం ఉండే వలల వంటివాటిని కూ డా తయారు చేసేవారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల వారి అవసరాలకు అను గుణంగా వీరు నార వస్తువులను తయారు చేసేవారు. కనుక వీరి రాక కోసం అ ప్పటి గ్రామీణులు ఎదురు చూసేవారు.

యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరగటం, మ హారాష్ర్ట, బెంగాల్‌ నుంచి గోనె సంచులు పెద్ద ఎత్తున దిగుమతి కావటం, గ్రామీణ ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం పెరగడంతో క్రమంగా వీరి వృత్తి దెబ్బతింది. అయితే వృత్తిపెై మమకారం చంపుకోలేనివారు ఇప్పటికీ గోనె సంచులు తయా రు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిని మనం నేటికీ నిజామాబాద్‌ ప్రాంతంలో చూడ వచ్చు. కాగా ఆదిలాబాద్‌, ఖమ్మం వంటి జిల్లాలల్లోని పెఱిక సామాజికవర్గం వారు మరింత వెనుకబడ్డారు. కనుకనే రిజర్వేషన్‌ అంశంలో ఈ ప్రాంతాలలోని వారు త మని బిసి-బి నుంచి బిసి-ఏ గ్రూప్‌కు మార్చమని ఎంతోకాలంగా కోరుతున్నారు.

అయితే పెఱిక వ్యవసాయ అనుబంధ వృత్తి కావడంతో వీరికి కావలసిన ముడిసరుకు, అవసరమైన వాటిని వీరే పండించు కునేవారు. ఈ నేపథ్యంలో వీరికి భూముతో అవరాలు పెరిగా యి. కనుక అనివార్యంగా వీరు భూమి కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో వీరికి భూమిపెై ఎంతోకొంత ఆధిపత్యం వ చ్చింది. భూమిపెై ఆధిపత్యం సంపాదించారు కనుకనే అది వీ రికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. వీరి కుల వృత్తి దెబ్బతిన్నా సొం త భూమి ఉన్న కారణంగా మరొక వృత్తి చేసుకోగలిగారు. ఈ విధంగా వీరు సమాజంలో అన్ని రంగాలలో మనకు కనిపి స్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల దగ్గర నుంచి చిరు వ్యాపారి వరకు వీరు అన్నింటా మనకు కనిపిస్తారు.

ఒక్కమాటలో చెప్పాలంటే వీరు ప్రవేశించని రంగం లేదు. అయితే ఇప్ప టికీ వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉంటున్నారు. కనుకనే వీరి రాజకీయ ప్రతినిధులు శాసన సభలో మనకు దర్శనమిస్తూనే ఉంటారు. అంతేకాదు... వీరు ఎక్కడ ఉన్నా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఎక్కువమంది ఉద్యోగులుగా స్థిరప డ్డారు. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారున్నా రు. ఇంకా చెప్పాలంటే... ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ సమాజిక వర్గాన్ని మర్చిపోకుండా మిగిలిన వారి ఎదుగుదలకు తపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజభా ని హైదరాబాద్‌లోని ఖెైరతాబాద్‌ నడిబొడ్డున మనకు పెఱిక భవన్‌ దర్శనమిస్తుంది. ఈ భవనంలో వీరు తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు వసతి కల్పించి విద్యావంతులును చేస్తున్నారు.

స్థలం కేటాయిస్తే....
ahladరాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో పెఱిక సమాజిక వర్గానికి చెందిన వారికి కనీసం ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే కమ్యూని టీ పరంగా ఉపయోగం ఉంటుందని ఆం ధ్రప్రదేశ్‌ పెఱిక సంఘం అధ్యక్షుడు ఎన్‌ ప్రహల్లాద్‌ ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకు న్నా ఖెైరతాబాద్‌లో తమ సమాజిక వర్గంవారి సహకారంతో పెఱిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించుకున్నామని చెప్పా రు. తమ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్ధులు ఇక్కడ దాదాపు వందమంది ఉచిత సౌకర్యం పొందుతున్నా రన్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు.

నామినేటెడ్‌ పోస్టులలో తమ పెఱిక సంఘానికి చెందిన వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. దశాబ్దాల కిందటే కుల వృత్తి కోల్పోయారు కనుక స్వయం కృషితో ఎదిగిస్తున్న వారికి వ్యవసాయం వృత్తిలో సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పెఱిక కులానికి చెందివారిలో దాదాపు 99 శాతం వ్యవసాయంపెైనే ఆధారపడి ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిలాలలో తమకు గుర్తింపు ఉందనీ, ఆయా జిల్లాలలో రాజకీయ చెైతన్యం పొందిన పెఱిక సంఘం నాయకులకు నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
aasw

No comments:

Post a Comment