Tuesday, 19 June 2012

పౌరుషానికి ప్రతీకలు.. పాల ఏకిరిలు

June 10, 2012
DSCF0121పాల ఏకిరి... ఈ కులస్తులు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చిన రాజపుత్రుల తెగకు చెందిన వారు. వీరి ధెైర్యసాహసాలు విజయనగర రాజులు గుర్తిం చి సామంత రాజులుగా, పాలెగాళ్లుగా బాధ్యతలు అప్పజె ప్పారు. తర్వాతి కాలంలో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడంలో పాల ఏకిరిలు తమ వంతు పాత్ర పో షించారు. స్వాతంత్య్రానంతరం రాచరికాలు పోవడంతో వీరు సామాన్య పౌరులుగా బతకాల్సి వచ్చింది. ఆత్మాభి మానం అడ్డురావడంతో దిక్కుతోచక కొండలు, గుట్టలు పట్టి తిరిగారు. అందుకే వీరు ఐదు దశాబ్దాల కిందటే బీసీ లుగా గుర్తింపు పొందారు. నేటికీ కొండకోనల్లోని ఎండు పుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు. ఈ గణతం త్ర రాజ్యంలో బలహీనులు- కడుహీనులుగా బతుకుతు న్న పాలఏకిరి సామాజికవర్గ జీవితాల్లోకి తొంగి చూస్తే...

రాయలసీమ జిల్లాలలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనం తపురం, కోస్తాలోని నెల్లూరు, తెలంగాణలోని హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకే పాల ఏకిరిలు పరిమితమయ్యారు. ఉత్తర భారత దేశం నుండి వలస వచ్చిన పాలఏకిరి కులస్తులు రాయ లసీమ ప్రాంతంలో సామంత రాజులుగా, పాలెగాళ్లుగా గుర్తిం పు పొందారు. వేషధారణ కూడా అదే విధంగా ఉండేది. అప్ప ట్లో వీరి ప్రధాన వృత్తి వేట. ఆ నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా వీరికి భూములు కేటాయించింది. మాట ఇచ్చారంటే తప్పే వారు కాదు. నుక ఆస్తులే కాదు, ప్రాణాలు సైతం పోగొ ట్టుకున్న వారు వీరిలో ఉన్నారు. ఎవరెైనా చిన్న మాటన్నా సహించేవారు కాదు. పోటీపడితే వెనకడుగు వేసే ఆలోచన అంతకంటే ఉండేది కాదు. నిప్పుకు ఉప్పు తోడెైనట్లు వీరికి కో పం కూడా ఎక్కువే. కనుకనే తరచూ తగాదాలు, కొట్లాటలకు దిగేవారు. వీధిపోరాటాలు సర్వసాధారణం.
ఇక దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలలో వీరు తమ వంతు పాత్ర పోషించారు.

పుట్టుకతోనే వచ్చిన నాయకత్వ లక్ష ణాలు పుణికిపుచ్చుకున్న వీరు స్థానికులను ఏకంచేసి స్వాతం త్య్రోద్యమంలో పాల్గొన్నారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన త ర్వాత వీరు కొత్త సమస్యను ఎదుర్కొన్నారు. గతంలో మాదిరి బలమున్నవారిదే రాజ్యం అనే మాటకు అవకాశం లేకుండా పో యింది. రాచరికానికి చరమగీతం పాడటంతో వీరి ప్రాభవం తగ్గిపోయింది. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా దే శంలోని ప్రజలు నడచుకోవటంతో వీరు సామాన్య పౌరులు గా బతకాల్సి వచ్చింది. వీటన్నింటి ఫలింగా ఉన్న ఆస్తులు హ రించుకుపోయాయి. ఆత్మాభిమానం అడ్డురావటంతో గ్రామం లో ఉండలేక కొండలు గుట్టలు పట్టి తిరిగారు. అవే వారికి ఆ శ్రయ దుర్గాలు కావడం, వేట వీరి ప్రధాన వృత్తి కావడంతో అ క్కడే జీవనం సాగించారు. కనుకనే అన్ని రంగాలలో వెనుకబడి నేటికీ కొండ ప్రాంతాలలోనే దయనీయ జీవితాన్ని గడుపు తున్నారు. మురళీధరన్‌ కమిషన్‌ వీరి గురించి ప్రస్తావిస్తూ... బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ‘మౌర్యులు’, ఒరిస్సా, మహారాష్ర్ట, మధ్యప్రదే శ్‌లో ‘నాయక్‌’లుగా పిలుబడుతున్నారని పేర్కొంది. చరిత్రలో వీరి ప్రధాన వృత్తి మిలటరీ, పోలీస్‌ సర్వీస్‌ అని వివరించింది.

వీరి దీన స్థితిని చూసిన ప్రభుత్వం 1955లో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేర్చింది. బిసీ రిజర్వేషన్‌ ఫలాలు రుచి చూసే లోపే... అంటే 1970లో బీసీ జాబితా నుండి వీరు తొలగించ బడ్డారు. తిరిగి రిజర్వేషన్‌ సౌకర్యం పొందటం కోసం పాల ఏకి రి కులస్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఎన్‌టి రా మారావు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరి ప్రయ త్నాలు ఫలించి బిసీ జాబితాలో వీరిని 1986లో చేర్చారు. అయితే ఈ జీఓను కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అప్పట్లో హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుకు అను గుణంగా జీఓలో మార్పులు చేయడాన్ని గురించి ప్రభుత్వం ప ట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1994లో అప్పటి ముఖ్యమం త్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పుట్టు స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కమిషన్‌ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాక జీవో వస్తుం దని ఎదురు చూశారు. అయితే కోట్ల ప్రభుత్వం పతనం కావ డంతో తర్వాత వచ్చిన పాలకులు పుట్టు స్వామి కమిషన్‌ను ప ట్టించుకోలేదు. ఈ క్రమంలో మళ్లీ పాల ఏకిరి వారు ఎన్నో ప్ర యత్నాలు చేశారు.

వీరి ప్రయత్నాలు ఫలించి 2007 ఆగస్టు లో పాల ఏకిరిని బిసీ జాబితాలో చేరుస్తూ జీఓ విడుదలెైంది. కాగా ఈ పాల ఏకిరి కులస్తులు కర్నాటకలో ఎస్టీలుగా, తమిళ నాడులో బీసీలుగా చెలామణి అవుతున్నారు. పూర్వం పాలెగా ళ్లుగా ఉన్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో తిన డం... కాలక్షేపంతోనే రోజులు గడిపేశారు. విద్య పట్ల ఏమా త్రం శ్రద్ధ చూపలేదు. ఫలితంగా తర్వాతి కాలంలో అన్ని రం గాలలో బాగా వెనుకబడ్డారు. పెైగా కొండకోనల్లో జీవనం సా గించడంతో బడికి దూరమయ్యారు. కనుకనే గతంలో దొర... దొరబిడ్డగా పిలువబడిన వీరు నేడు పామరుల స్థాయికి దిగజా రుతున్నారు. కొండకోనల్లోని ఎండుపుల్లలు తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారు.

మరికొందరు వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నారు. ఇప్పటికీ చాలీచాలని పూరిళ్లలో రోజులు గు డుపుతున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన బంగారుపల్లి జమిం దారు చిత్తూరులో ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. ఈ పాఠ శాల ఏర్పాటు కావడంతో కొంత మేరకు వీరిని విద్యారంగం వెై పు మొగ్గు చూపే విధంగా చేసింది.అయినప్పటికీ నామమా త్రంగానే వీరు విద్య పట్ట శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విద్యకున్న ప్రాధాన్యత వీరికి తెలిసి రావడంతో తమ పిల్లలను బడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఓబీసీజాబితాలోచేర్చాలి
Koదశాబ్దాల పోరాట ఫలితంగా బీసీ రిజ ర్వేషన్‌ జాబితాలో స్థానం సంపాదించినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో తమకు రిజర్వే షన్‌ ఫలాలు అందట్లేదని చెపుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ పాల ఏకిరి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్‌ కొండమ నాయుడు. ఓబీసీ జాబితాలో పాల ఏకిర కులాన్ని చేర్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన విద్యా, ఉద్యోగాల రంగా లలో తమకు రిజర్వేషన్లను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. జనాభా పరంగా పాల ఏకిరి కులస్తుల సం ఖ్య అతి తక్కువగా ఉన్నందున ఎన్నికల్లో పోటీచేసి గెలిచే పరిస్థితులు లేవంటారు. తమ పూర్వీకులు దేశ స్వాతం త్య్రం కోసం తమ వంతు పాత్ర పోషించారు కనుక తమ సామాజిక వర్గానికి కనీసం నామినేటెడ్‌ పోస్టులయినా కట్ట బెట్టాలని కోరుతున్నారు.

రాయలసీమలోని ప్రతి జిల్లా లోనూ పాల ఏకిరి విద్యార్ధులకు ప్రత్యేక హాస్టల్‌ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఇక వ్యవసాయ కూలీలు గా జీవిస్తున్న తమ కులం వారిని ప్రోత్సహించేందుకు బ్యాంకు రుణాలు మంజూరు చేస్తే చిరు వ్యాపారులుగా నయినా మారతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నోట్‌ ;
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.comకు మెయిల్‌ చేయవచ్చు లేదా వేణుగోపాల్‌ (ఫోన్‌:9603462269) ను సంప్రదించవచ్చు

dfg

No comments:

Post a Comment