Tuesday 19 June 2012

కూడు పెట్టని కులవృత్తి


June 2, 2012
022 
ఐక్యత... కట్టబాట్లకు ప్రతీకలుగా నిలుస్తారు వీరభ ద్రీయులు. భక్తిపారవశ్యంతో వీరు తమ శరీరాన్ని తూట్లు పొడుచుకుంటారు... కణకణలాడే అగ్గిగుండాలను అవలీలగా దాటేస్తారు. వీరికి వీరుముష్టి, నెత్తికోతల, విభూతులవారు... వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయితే రాష్ర్ట వ్యాప్తంగా వీరు వీరభద్రీ యులగా పిలిపించుకోవాలనే తపనతో పాతపేర్లకు తిలోదకాలు పలికారు.వీరి కులం పేరులో కనిపించే ‘ముష్టి’ అనే పదం వీరి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. అప్పట్లో వీరి పిడికిలి దెబ్బతో కొబ్బ రికాయ నుజ్జు నుజ్జు అయ్యేది. అంతేకాదు... అప్పట్లో వీరు బలశాలులు కావడంతో ప్రెైవేట్‌ ఆర్మీగా ఏర్పాడి నాటి వెైశ్యుల ధన, ప్రాణాలను రక్షించారు. కనుకనే ఇప్పటితరం వెైశ్యుల ద గ్గర భిక్షాటన చేస్తుంటారు. వెైశ్యుల దగ్గర తప్ప మరెక్కడా చే యిచాపరు. అయితే ఈ ప్రక్రియను వీరు అడుక్కోవడంగా భా వించరు! వెైశ్యులు తమకు ఇచ్చేది బిక్ష కాదంటారు.

దాన్ని కేవ లం తాము అప్పట్లో వారి ధన ప్రాణాలు కాపాడినందుకు కృత జ్ఞతగా వెైశ్యులిచ్చే పారితోషకమని చెపుతారు. అప్పటి తరం తమ కండబలంతో వెైశ్యుల ఆస్తులు కాపాడారు కనుకనే ఇ ప్పుడు వారు ఉన్నత స్థితిలో ఉన్నారని చెపుతారు. ఈ నేపథ్యం లో పెై స్థాయిలో ఉన్న వెైశ్యులు వీరభద్రియులను ఆదుకో వాల్సిన కనీస బాధ్యత ఉందంటారు. అంతేకాదు... వెైశ్యులకు సంబంధిచిన శుభకార్యాలలో వీర పాల్గొని భద్రీయుని విగ్ర హానికి స్నానం చేయించడం, దండకాలు చదవడం ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. వీరి పూజా విధానం కూడా పద్యాల రూపం లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం కులం పేరుచూపి తమను హీనంగా చూడవద్దని కోరుతున్నారు. వీరభద్రియు లుగా సమాజంలో సముచిత స్థానం కల్పించమంటున్నారు.

వీరభద్రులు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో వీరభద్రస్వామి ఉత్సవాలు చేస్తారు. ముఖానికి వీభూతి దట్టిం చి, రుద్రాక్ష మాలలు, వెండి లింగం కాయను మెడలో వేసు కుని, నడుము చుట్టూ గంటలు, శంఖం, చేతకత్తి చేతబట్టి, జేగంటతో జాతరలలో ఎవరెైన దర్శనమిస్తుంటారు. నారస ములు గుచ్చుకుని నాట్యం చేస్తారు. పాటలు పాడుతూ, చేతిలోని కత్తిని లయబద్దంగా తిప్పుతూ వీరంగం వేస్తారు. దండకాలు, వీరంగాలు, శరభలు... తదితర పద్య గేయ సాహిత్యం ఈ సాంప్రదాయంతో ముడిపడింది. ఈ సందర్భం గా నగారా, కంచు జాగట మోగిస్తారు. నాలుకకు శూలాలు గుచ్చుకోవడం, మెడకు దబ్బనం గుచ్చుకోవడం సర్వసాధార ణం. అంతేకాదు శరీరభాగాలపెై దబ్బనాలు గుచ్చుకుని తమ భక్తిని చాటుకుంటారు. భారీ ప్రబలు కట్టడంతో వీరికి వీరే సాటి. భక్తి పారవశ్యంలో అగ్నిగుండాలను తొక్కుతారు.

ఇక వీరు పచ్చబొట్టు వేయడంలో కూడా నిష్ణాతులు. కీళ్ల నొప్పులకు, మోకాళ్ల పొప్పులకు, ఛాతీ నొప్పులున్నవారు వీరి వద్దకు గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చి పచ్చబొట్లు పొడిపించు కుంటారు. ఇప్పటికీ గ్రామాలలో ఈ ప్రక్రయ కొనసాగుతూనే ఉంది. ప్రజలలో వస్తున్న మార్పు కారుణంగా వీరి కులవృ త్తికి ఆదరణ తగ్గింది. వీరు వీభూతులు తయారు చేస్తారు కనుక వీరిని వీభూతులవారు అని కూడా పిలుస్తారు. ఈ నేప థ్యంలో ఊరూరూ తిరగటం, దేశ దిమ్మరులుగా మారటం వీరివంతెైంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. ఎక్కువ భాగం ఊరి చివర చింతచెట్ల కిందే వీరు మకాం చేస్తుంటారు. వీరి వద్ద సామాను ఎక్కువ ఉన్న సందర్భాలలో మాత్రం పీర్ల చావిళ్లను ఆశ్రయిస్తారు. వీరికి కూడా మిరాశీ గ్రామాలు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను ఎప్పుడూ దాటే ప్రయత్నం చేయరు. ఇక చాపలు అల్లి, అల్యూ మినియం పాత్రలు మార్కెట్‌ చేసి కూడా జీవనం సాగిస్తారు.

ఈ విధంగా ఇప్పటి తరంలోని వీరభద్రీయులు ఎక్కువమంది కష్టించి పనిచేయటమో, చిరువ్యాపారం చేసి గౌరవంగా బత కటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం కులం పేరుతో తమను చిన్నచూపు చూ డటంతో మానసి కంగా కుంగిపోతు న్నారు. ప్రస్తుతం వీరు అల్యూమినియం పాత్రలు వ్యాపా రమే వృత్తిగా ఎంచుకున్నారు. పెట్టబడి పెట్టే స్తోమత లేకపోవ టంతో ఎక్కువమంది అప్పుతెచ్చుకుంటారు. అధికవడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో ఊరూరా తిరిగి సంపా దించిన సొమ్ములో దాదాపు సగం సంపాదన వడ్డీలకే చెల్లిస్తారు. ఇటువంటి దయనీయ పరిస్థితిని అధిగమిం చేందుకు తమ పిల్లలకు విద్య చెప్పించే ప్రయత్నం చేస్తున్నా రు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీర భద్రీయులు’గా మార్పు చేయించు కున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో కుల ధృవీకరణ పత్రాలలో వీరి పేరును వీరముష్టిగానే అధికారులు మంజూరు చేస్తున్నారు. దీనిపెై వీరు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్దమవుతున్నారు.

శీతకన్ను
Kssప్రభుత్వ చల్లని చూపు తమపెై లేదంటారు ఆంధ్రప్రదేశ్‌ వీరభద్రియ (వీరముష్టి) సంఘం అధ్యక్షులు కె. రాజేశ్వరరావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ తమకోసం ప్రభుత్వం కేటాయించిన ఫలాలు తమకు అందలేదని చెపుతున్నారు. స్వయం కృషితో వీరభద్రీయులు చిరువ్యాపారాలు ప్రారంభించి రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తే మరి కొన్ని కుటుంబాలు దారిద్య్రరేఖను దాటుకుని ముందుకువస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఫెైనాన్స్‌ కార్పొరేషన్‌ విషయంలో కూడా ప్రభుత్వం తమకు ఆశలు రేపిందే తప్ప... ఆచరణలో చూపలేదంటారు. కుల వృత్తి కోల్పోయి చిరువ్యాపారాలకే పరిమితమైన తమను ఆదుకోవాలని కోరుతు న్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ప్రభుత్వం ఇతోధికంగా సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. మరి ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాల ద్వారా ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
awq

No comments:

Post a Comment