Tuesday 19 June 2012

జిల్లాకోక వృత్తి... అయినా విముక్తి లేదు

June 1, 2012
Chattaదేశ ప్రధానిగా ఎదిగి, బహుబాషా కోవిదునిగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావుకు చిన్నతనంలో విద్యాబోధచే సింది చాత్తాద శ్రీవెైష్ణవులే. నిజాం నవాబుల ఆస్థాన వెైద్యలూ వీరే. నర్శింహ శతకం, కృష్ణ శతకం రచించిందీ వీరీ వంశీ యులే. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి మాత్రం అందుకు భి న్నంగా ఉంది. రోజు గడవడమే దుర్భరమై జిల్లాకొక వృత్తి చ ేసి పొట్టపోసుకుంటున్నారు. సాతాని అంటే... ధరించనివారు అనే అర్థం ధ్వనిస్తుంది. 11 శాతాబ్దంలో ఇది ప్రాచుర్యం పొందింది. కాగా సాతాని కులస్తులు తర్వాతి కాలంలో చాత్తాద శ్రీ వెైష్ణవగా పేరు మా ర్చుకున్నారు. బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించి, జంధ్యాన్ని- శి గను త్యగించి, వెైష్ణవ తత్వాన్ని చాటిచెప్పినవారే చాత్తాద శ్రీ వెైష్ణవులు. చాత్తాద అంటే త్యజించినవాడు అని అర్థం. రామా నుజాచార్యుల శిష్యుపరంపరే చాత్తాద శ్రీ వెైష్ణవులు.

ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయంకోసం గళం విప్పిం ది వీరే. తిరుపతిలో పూల తోటలు పెంచి శ్రీ వేంకటేశ్వర స్వా మికి అర్పించారిని చరిత్ర చెపుతోంది. అంతేకాదు... వీరు దే వాలయ ప్రాంగణాలను ఊడ్చి శుభ్రం చేయటం, దేవాల యంలో వాడిపోయిన పూలను తీసివేయ టం... వంటి పను లు కూడా చేస్తుండేవారు. ఇక గ్రామాల్లో సాతాని అయ్య వా ర్లు, సాతాని పంతుళ్లుగా ఇప్పటికీ కొన్ని జిల్లాలలో వీరు పిల వబడుతున్నారు. అప్పట్లో గ్రామ చావిడిలో కూర్చొని పాఠా లు చెప్పేవారు. పాఠశాల నడిపే స్తోమత లేకపోవడంతో చెట్టు కింద పాఠశాలలను నడి పారు. ఈ క్రమంలో రెైతులు ఏడా దికి ఒకసారి ఇచ్చే ధా న్యంతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిం చారు. అంతేకాకుండా తమకు తెలిసినమూలికా వెైద్యం ద్వా రా ఆయా గ్రామీణ ప్ర జలకు వెైద్య సేవలందించారు. ఇప్పటి కీ కొన్ని వెైష్ణవ దేవాల యాల్లో అర్చకులుగా కూడా వ్యవహరి స్తున్నారు. అయితే థూప దీప నెైవేద్యాల పేరుతో 2, 500 రూపాయలు మాత్ర మే వీరికి అందుతున్నాయి.

అది కూడా గ్రామ పంచాయితీల దయాదాక్షిణ్యాలపెైన ఆధారపడా ల్సి వ స్తోంది. వీరికి కనీసం మూడు వేల రూపాయలు చెల్లిం చాల ని సుప్రీం కోర్టు ఆదేశించినా అమలు చేసినవారు లేరు! నెల కు వస్తున్న రూ.2, 500లపెై కుటుంబం మొత్తం ఆధార పడి జీవిస్తోంది. కనుకనే వీరి జీవితాలు దుర్భరంగా పూరిగు డిసె లకే పరిమితమ య్యాయి. ఇదిలా ఉంటే వారసత్వంగా భూ మి వస్తుందన్న మాటేకానీ, దానికి పట్టాలేకపోవడంతో ఆ యా గ్రామ పెత్తం దారులపెై ఆధారపడాల్సి వస్తోంది. మరికొ న్ని గ్రామాలలో తరతరాలుగా వస్తున్న భూములు అన్యాక్రాం తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాయలసీమ జిలా ్లల లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపెై వీరు ఐక్య పోరాటాలు చ ేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో అర్చన కోసం న్యాయపో రాటాలు చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. గతంలో వీరికి 7 4 మఠాలు ఉండేవి. అయితే ఇప్పుడు వారి పౌరొహిత్యం కింద ఉన్నవాటిని వేళ్ల మీదలెక్కించవచ్చు.

తూర్పుగోదావరి జిల్లాలో తాలూరు మఠాన్ని అగ్రవర్ణాలవారు లాక్కునే ప్రయ త్నాలు చేస్తే అక్కడ నిరంతర పోరాటం చేస్తు న్నారు. అక్కడ వీరే పూజారులు కావడంతో ఈ పరిస్థితి దాపు రించింది. ఇక కదిరి నర్శింహస్వామి దేవాలయంలో ఎంతో కాలంగా వీరు పూజలు చేస్తుండగా వీరిని వెైకానసులు తరి మికొట్టారు!. ఈ విధంగా వీరికి బలం ఉన్న చోట న్యాయపో రాటాలకు దిగుతూ... బలం లేని చోట వాటిని వదులుకుం టున్నారు. సంఖ్యాపరంగా వీరి జనాభా తక్కువ కావడంతో భవిష్యత్‌లో తమ చేతిలో ఎన్ని దేవాలయాలు ఉంటా యో కూడా చెప్పలేమంటున్నారు. ‘స్వామి’ అని పదాన్ని వీరు తమ పేరుకు చివర్న చేర్చుకో వడంతో అప్పట్లో వీరు ఎక్కడున్నా సులభంగా గుర్తించే వా రు. అయితే ఈ స్వామి కులం పేరు కాకపోవడంతో మిగతా కులాలవారు కూడా ఆ స్వామి పదాన్ని పేరుకు చివర్న తగి లించుకోవడంతో స్వామి అనే పదానికి వీరిలో కూడా ప్రాధ న్యత తగ్గిపోయింది. ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి చివ రకు వీరు జిల్లా కొక వృత్తిలో కొనసాగుతున్నారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలలో అర్చకులుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారు. కాగా ఇక్కడ వీరు జంథ్యం వేసుకోవ డం సర్వసాధారణం. ఉభయ గోదావరి జిల్లాలలోని వారు అర్చక త్వంతోపాటు శ్రాద్థ ఖర్మలు కూడా ని ర్వర్తిస్తారు. నిజా మాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో అద్దకాలు అద్ది జీవిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అడవిలోని అడ్డాకులు సేకరిం చి వాటిని విస ్తళ్లు కుట్టి మార్కెట్‌ చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొన్ని జి ల్లాలలో హరిదాసులుగా కూడా బిక్షాటన చేస్తు న్నారు. ఈ వి దంగా ఏ జిల్లాలో ఏ వృత్తి ఎంచుకున్నా వీరిలో ఎక్కువమంది బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఎంబీసీలుగాగుర్తించాలి;
Chattada-చాత్తాద శ్రీ వెైష్ణవులను తమిళనాడులో ఎంబీసీలుగా గుర్తించారనీ అదే విధంగా రాష్ర్ట ప్రభుత్వం కూడా తమను ఎంబీసీలుగు గుర్తించాలని ఎంబీసీ సంక్షేమ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు టి రామానుజం కొరుతున్నారు. తమ పూర్వీకులు దేవాలయాలలో చేస్తున్న అర్చక వృత్తిని ఆధిపత్య పోరాటంలో కోల్పోయిన వారు దయనీయ స్థితిలో రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలలోని వారిని అర్చకులుగా తిరిగి నియమిం చడానికి ప్రభుత్వం కృషి చేయాలంటారు. ఇక మూలికా వెైద్యంలో ఎనలేని ప్రామీణ్యం కనబరుస్తున్న తమ సామాజిక వర్గంవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఔషథ మొక్కల పెంపకానికి స్థలం కేటాయించా లంటారు.

అంతేకా కుండా ఆర్థిక స్తోమతలేని చాత్తాద శ్రీ వెైష్ణవులు గ్రామీణ ప్రాంతాలలో ట్యూషన్లు చెప్పి ఇప్పటికీ జీవనం సాగిస్తు న్నారనీ, అటువంటివారికి జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సాహాన్ని కల్పించాలని కోరు తున్నారు. తరతరాలుగా దేవా లయాలతోనే తమ జీవితాలు ముడి పడి ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులతో చాత్తాద శ్రీ వెైష్ణవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.

hjkl

No comments:

Post a Comment