Tuesday 19 June 2012

వెలవెబోతున్న నీల’ వెలుగులు


June 3, 2012
సమాజంలో గౌరవంగా బతికేందుకు నీలకులస్థులు చేయని ప్రయత్నం లేదు. అధునాతన పరికరాలు వీరి వృత్తిలోకి ప్రవేశించడంతో కులవృత్తినే పట్టుకుని వేలాడకుండా మరో వృత్తిని ఎంచుకున్నారు. అక్కడా ఎదురుదెబ్బతినడంతో ఇంకో వృత్తిని ఎంచుకున్నారు. ఈ విధంగా బతుకుతెెరువు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. శ్రమిస్తూనే ఉన్నారు

Cotto
నూలు వస్త్రాలకు అద్దకాలు అద్దేందుకు ఉపయోగించే నీలి రంగు తయారీలో వీరు నిష్ణాతులు. శుద్థి చేసిన నూలుకు హా ని కలుగకుండా, రంగు వెలిసిపోకుండా వీరు రంగులను త యారు చేయడంతో అప్పట్లో చేనేత కార్మికులు వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కనుకనే వీరు తయారు చేసే నీలి రంగు కు చేనేతకార్మికులలో మంచి గిరాకీ ఉండేది.

నీలికులస్తులు రె క్కలు ముక్కలు చేసుకుని ఈ రంగు తయారు చేసేవారు. దీని కోసం రోజుల తరబడి చెమటోడ్చేవారు. వీరు నీలి రంగును త యారు చేసే ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా ఉండేది. తగరే సల అనే చెట్టు గింజలను ఉడకబెట్టి వాటి నుండి చిక్కడి ద్రవా న్ని తీనేవారు. ఈ ద్రవం నీల రంగులో ఉంటుంది. ఈ ద్రవాని కి బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఇండిగోను కలిపి మీట రు ఎత్తున్న కాగుల్లో మగ్గబెట్టేవారు. ఈ ప్రక్రియ మరీ విచిత్రం గా ఉంటుంది. మేక, గొర్రె పెంటికలను సేకరించి వాటి మధ్య ఈ కాగులను నిలబెట్టేవారు. టైం గడిచేకొద్దీ ఈ పెంటికలలో రసాయన క్రియ జరిగేది. దీంతో వెచ్చటి ఆవిర్లు వెదజల్లేవి. ఈ విధంగా రెండు రోజులపాటు కాగుల్లో ఉన్న ద్రవం క్రమంగా మగ్గుతుంది. ఫలితంగా నల్లటి రసం తయారయ్యేది.

అయితే వీరు తయారు చేసిన ఈ రంగులు పర్మనెంట్‌గా ఉండాలంటే మరికొంత శ్రమపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో సున్నపు రాయిని తీసుకొచ్చి బట్టీ పెట్టి సున్నం తయారు చేసే వారు. చౌడు భూముల నుంచి సేకరించిన మట్టీకి ఈ సున్నాన్ని కలిపి మిశ్రమాన్ని పెద్ద కుండలో వేసి బాగా ప్రెస్‌ చేస్తారు. దాని పైన నీళ్లు పోస్తే ఒక్కొక్క బొట్టు ఆ కుండ ద్వారా ఫిల్టర్‌ అవు తుంది. ఈ విధంగా వచ్చే ద్రవం చాలా గాఢంగా ఉంటుంది. ఆ ద్రవాన్ని అంతా సేకరించి నీలి, నలుపు రంగుల్లో కలిపి కడ వలలో నిల్వ చేసేవారు. ఈ నిల్వచేసిన రంగులను నూలుకు ప ట్టించేవారు. వాడకంలో బట్టలు చీలికలు-పేలికలుగా మారి నా... వీరు వేసిని రంగు మాత్రం వెలిసేదికాదు. నీలి, నలుపు రంగులు కాకుండా, ఇతర రంగులు కావాలంటే ఆయా పాళ్ల వంతున కెమికెల్స్‌ వేసి తయారు చేసుకునేవారు. అప్పట్లో చే నేత కార్మికులు వీళ్ల దగ్గరకు నూలు తెచ్చి రంగులు అద్దకం చే యించుకునేవారు.

అయితే ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రంగులు, రసాయనాల కారణంగా వీరి వృత్తిపై వేటు పడింది. అంటే ఆ రంగుల ఖరీ దు తక్కువ కావడంతో ఆ పోటీకి వీరు తట్టుకోలేకపోయారు. వీరు క్రమంగా వృత్తికి దూరమయ్యారు. వీరి కులవృత్తి దె బ్బతినటంతో దీనికి అనుబంధంగా ఉన్న చేనేతవైపు వీరు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వీరు కూడా నూలు వడికి దారం తీసి పడుగుకట్టి మగ్గాలపై బట్టలు నేసే ప్రయత్నం చేశారు. క నుకనే ఇప్పటికీ చేనేత రంగంలో ఈ నీలికులస్తులు చాలా మంది జీవనం గడుపుతున్నారు. మీటర్లు బట్ట నేస్తే వచ్చే ఆదా యం చాల తక్కువ. అయినప్పటికీ వీరు ఉదయం పది గుంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఇంతగా శ్రమించినా కనీసం పది మీటర్ల బట్ట నేయటం గగ నం.

బాగా అనుభవం ఉన్న వారు మాత్రం మరో రెండు మీట ర్లు నేయగలరు. అంటే ఎంత నైపుణ్యం ప్రదర్శించినా రోజు మొత్తం మీద 100 రూపాయలకు మించి సంపాదించలేరు. అయితే గతంలో పోల్చుకుంటే వీరి పరిస్థితి కొంత మెరుగ య్యిందనుకుంటున్న సమయంలో చేనేత రంగంలోకి కూడా ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేశాయి. దీంతో చేనే తరంగానికి కూడా ఊహించని దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ వీ ళ్లకు కషాలు మొదలయ్యాయి.

సున్నితమైన పనికి అలవాటు పడిన వీరు కాయకష్టం చేయ లేక ఇంటిపట్టున ఉండి బీడీలు చుట్టే పనిని ఎంచుకున్నారు. కాగా ఇక్కడా వీరు దోపిడీకి గురవుతున్నారు. బీడీ పరిశ్ర మలో యాజమాన్యం వెయ్యి బీడీలకు సరిపోను తునికాకు సప్ల య్‌ చేయదు. తరుగుబడిన ఆకును వీరే కొనుగోలు చేసి వేయి బీడీలకు లెక్క చూపాలి. దెబ్బతిన్న ఆకు ఇచ్చి మంచి బీడీలుత యారుచేసి ఇవ్వాలని యాజమాన్యం డిమాండ్‌ చేస్తుంది. ఈ క్రమంలో తరుగు భర్తీ చేయడానికి వీరి శ్రమలో కొంత భాగం కోల్పోతున్నారు. అయితే పూట గడవడానికి కావలసిన డబ్బు చేతికి అందటంతో ఈ వృత్తిని వదులుకోలేకపోతున్నారు.

క్రమంగా బతుకుదెరువు కోసం బీడీలు చుట్టడానికి సిద్దమ య్యారు. మొదటి నుండీ కుటీర పరిశ్రమకు అలవాటు పడ్డవారు కావడంతో బీడీలు చుట్టడం వాటిని సంబంధిత య జమానికి చేరవేయడంతో బతుకు సాఫీగానే సాగింది. అయితే ఈ పరిశ్రమ కూడా సంక్షోభంలో చిక్కుకోవటంతో నేడు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కాలగమనంలో అనేక అడ్డంకులు ఎదురైనా శతాబ్దాల క్రిందటి వీరు వేసిన నీలి రంగు మాత్రం వీరిని వదల్లేదు. అంటే ఇప్పటికీ నీలి కులస్తులు గానే సమాజంలో పిలువబడుతున్నారు.

మన రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నీలి కులస్తులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయారు. కర్నాటక రాష్ర్టంలో గుల్‌బర్గా, చిందోళి, ముధోల్‌, బీదర్‌ ప్రాంతాలలో వీరు విస్తరించారు. అక్కడ వీరు నీల్‌గా ర్‌గా పిలువబడుతూ బిసి రిజర్వేషన్‌ సౌకర్యాలు పొందుతు న్నారు. మహారాష్ర్టలో నీలినిరాళిగా గుర్తింపు పొందారు. ఈ రాష్ర్టంలో వీరికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించక పోవటంతో మరింత వెనుకబడ్డారు. మన రాష్ర్టంలో వీరిని నీలి కులస్తులు గా పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా వీరంతా ఇక్కడి నుండి వలసవెళ్లినవారే.

గ్రూపు మార్చినా మార్పులేదే!
kumar‘నీలి’ కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి బి గ్రూ ప్‌కు మార్చినా ఫలితం లేదని పెదవి విరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ నీలి కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్‌ అశోక్‌ కుమార్‌. బీసీ కులాలలో ఇప్పటికీ తాము అత్యంత వెనుకబడిన తరగ తుల్లో ఉన్నామని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో తమవా రికి కనీసం ఉండటానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతం నుండి తమ సామా జికవర్గం బీసీ రిజర్వేషన్‌ జాబితాలో ఉన్నా, ప్రభుత్వం చేసిన చిన్న పొరపాటు కారణంగా గత నాలుగు దశాబ్దాలు గా నీలి కులస్తులకు అందుతున్న రిజర్వేషన్‌ సౌకర్యాన్ని పూ ర్తిగా వినియోగించుకోలేక పోయామంటారు.

నీలి కులస్తు లను 1968లో బిసి-డి జాబితాలో ప్రకటిస్తూ ‘నెల్లి’ అని పే ర్కొనటంతో నీలి కులస్తులమైన తమకు అధికారులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తమ జీవనశైలి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలంటారు. నీలి కులస్తులలో ఎక్కువమంది చేనేత కా ర్మికులుగానే జీవనం సాగిస్తున్నారు కనుక తమకూ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని కోరుతున్నారు.

Untita

1 comment: