Tuesday 19 June 2012

‘కాచి’గూడ వీరిదే

June 15, 2012
DSCN1759 
హైదరాబాద్‌లోని మూసి నది ఒడ్డును పరిశీలిస్తే ‘కాచి’ కులం వారు కనిపిస్తారు. వ్యవసాయం, పూల తోటలను పెం చడం వీరి కుల వృత్తి. వీరి పూర్వీకులు నాలుగు శతాబ్దాల కిం దట బుందేల్‌ ఖండ్‌లోని బల్దోఘడ్‌ నుంచి హైదరాబాద్‌కు వల స వచ్చారు. అప్పట్లో వారు ఛత్రపతి శివాజీ వద్ద సైనికులుగా ఉండేవారు. రాంసింగ్‌ తోప్‌ వీరి మూల పురుషుడు. ఆయన పేరుతోనే కార్వాన్‌లో రాంసింగ్‌పుర ఏర్పడింది. కాగా ఈ కుల స్తులు క్రమంగా కులవృత్తిని కోల్పోయినప్పటికీ ఆ మూలా లను వదులుకోలేకపోతున్నారు. కనుకనే నాలుగడుగుల స్థ లం ఉన్నా కనీసం ఆకుకూరలెైనా పండించి మార్కెట్‌కు పింపి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నారు.వీరి పూర్వీకులు కూరగాయలు పండించి వాటిపెై వచ్చే ఆ దాయంతో జీవించేవారు. ఉత్తర భారత దేశం మొత్తం కాచీ కులస్తులు ఉన్నారు. అయితే వీరు ఎక్కడున్నా నది ఒడ్డును ని వాస ప్రాంతాలుగా ఎంచుకుంటారు. వీరు ఎంచుకున్న నది పరీవాహ ప్రదేశాలు క్రమంగా నగరాలుగా మారిపోవడంతో వీరు జీవనం కోల్పోయారు.

ఫలితంగా ఆర్థికంగా ఎదుగుదల లేక దారిద్రరేఖకు దిగువనే జీవిస్తున్నారు. అదేతీరు మన రా ష్ర్టంలోని కాచీ కులస్తులను చూసినా గమనించవచ్చు. రా్రష్ట రాజధానిలో విస్తరించిన మూసీ నది కూడా వీరి మనుగడకు బాగా తోడ్పడింది. గతంలో మూసీ నదిని ఆసరా చేసుకుని కూరగాయలు పండించి మార్కెట్‌ చేసి జీవనం గడిపేవారు. ఈ కులస్తులు ఎక్కువగా ఉన్న కారణంగానే ఆ ప్రాంతానికి ‘కాచీగూడ’ ఏర్పడింది. అయితే పట్టణం పెరగడం, భూమికి విలువ పెరగడంతో వీరు ఇతర ప్రాంతాలకు నెట్టివేయబ డ్డారు. మన రాష్ర్టంలో 1950లో వచ్చిన యాక్ట్‌ ప్రకారంఆయా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వీరికి 60శాతం భూమి, యజమానికి 40 శాతం భూమి దక్కడంతో వీరు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఏర్పాడింది. వీరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో చేతికి వచ్చిన భూమి చేజారి పోయింది. అంటే... 1976లో ఇందిరా గాంధీ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ తీసుకురావడంతో వెయ్యి గజాలకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు జంటనగరాలు మహానగర్‌గా రూపాంతరం చెందడంతో మూసీ నది ఒడ్డు కూడా క్రమంగా కనుమరుగెైంది.

కాలానుగుణంగా జరిగే మార్పుల ప్రభావం వీరిపెైనా పడింది. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవడానికే జాగా దొరకని పరిస్థితుల్లో వీరు కూరగాయలు పండించుకునే చోటు ఎక్కడుంటుంది?. కనుకనే వీరు తమ కుల వృత్తిని కోల్పోయారు. దీనికి తోడు ప్రభుత్వం నందనవనం పేరుతో మూసినదిని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించి చర్యలు చేపట్టడంతో వ్యవసాయంపెై కాచీ కులస్తులకున్న ఆశలు అడుగంటాయి. గతంలో తాము పండించిన కూరగాయలను మార్కెట్‌కు చేరవేసేవారు కనుక అక్కడ ఉన్న పరిచయాలతో వీరు కూరగాయలు అమ్ముకునే ప్రయత్నం చేశారు. కనుకనే ఇప్పటికీ కూరగాయల మార్కెట్‌లో వీరు చిరు వ్యాపారులుగా కనిపిస్తుంటారు. కాగా ఇప్పటికీ చాలామంది పాత వృత్తిని మర్చిపోలేకపోతున్నారు. కనుకనే జానెడు జాగా దొరికితే అక్కడే విత్తనాలు చల్లి ఆ భూమిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా కూరగాయలు పండించాలంటే ఎక్కువ కాలం పడుతుంది కనుక ఆకు కూరల మడులపెై మక్కువ పెంచుకున్నారు. కాచి కులంలోని మహిళలు కేజీ 35 రూపాయల చొప్పున మెంతులు కొనుకొస్తారు. వాటిని ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు చిన్న మడిలో వీటిని వేసి పెైన మట్టి చల్లుతారు. మరుసటి రోజుకు చిన్న మొలకలు వస్తాయి. వీటికి మూడు రోజులు నీళ్లు చల్లితే చాలు... అమ్మకానికి మెత్తి కూర రెడీ! అంటే పడిన శ్రమకు ఐదు రోజుల్లో ఫలితం దక్కుతుంది. కనుకనే మూడు కాళ్ల ముసలమ్మలు సైతం లేని శక్తిని కూడదీసుకుని మెంతి కూర పండించి... కట్టలు కట్టి మార్కెట్‌ చేస్తుంటారు. వీరికి ఉండటానికే ఇళ్లులేని కారణంగా మెంతి కూరను రోడ్డు పక్కన కూడా పండిస్తారు. కార్వాన్‌ ప్రాంతంలో 365 రోజుల్లో ఎక్కడో ఒక చోట పచ్చని తివాచీ పరిచినట్టు ఈ ఆకుకూర మడులు రోడ్డు పక్కన కూడా దర్శనమిస్తుంటాయి. వర్షాకా లం మాత్రం భారీ వర్షాలు పడితే మడులు కొంత దెబ్బతిం టాయే తప్ప పూర్తిగా నష్టపోయే పరిస్థితి లేదు కనుక వీరు ఆకు కూరల వరకే పరిమితమైపోయారు.

కాచి కులస్తులు సమన్యాయాన్ని ఇష్టపడతారు. కనుకనే వీరి పెళ్ళిళ్లు, శుభకార్యాలన్నీ వీరి కమ్యూనిటీ హాలులోనే జరి పిస్తారు. ఆ హాలు, అందులో ఉపయోగించుకునే వంట పాత్రలు వంటి వాటికి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవారెైన పప్పు, వెైట్‌ రెైస్‌తో సింపుల్‌గా ఇక్కడే పెళ్ళి జరిపిస్తారు. పెళ్లికి వచ్చినవారు పప్పన్నం తృప్తిగాతిని... వధూవరులను మనసారా ఆశీర్వదించి వెళతారు. అయితే పెళ్లంటే మాత్రం... పెళ్లికొడుకు గుర్రం ఎక్కాల్సిందే. ఎక్కడెైనా ఒకరిద్దరు ఇతర కులస్తులతో పోటీపడి తమ డాబు-దర్పం ప్రదర్శించుకోవాలనుకుంటే పెళ్లయిన నాలుగు రోజుల తర్వాత రిసెప్షన్‌ జరుపుకోవచ్చు. అయితే దానికి ఈ కమ్యూనిటీ హాలు మాత్రం ఇవ్వరు. ఈ తరహా రిసెప్షన్‌లు బహు అరుదుగా జరుగుతాయి. వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉండటంతోపాటు, సమాజంలోని అన్ని వర్గాలతో కలిపి శాంతిని కోరుకుంటారు.

ఖమ్మం, భీమవరం, కైకలూరు, విశాఖ, వరంగల్‌, నల్గొండ తదితరప్రాంతాలలో కూడా కాచి కులస్తులు ఉన్నారు.మహారాష్ర్ట, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌... తదితర రాష్ట్రాల లో వీరి వంశీయులు రాజకీయ నాయకులుగా ఎదిగి మంత్రు లుగా కూడా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా వారిలో మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వహి స్తున్నారు. మహారాష్ర్ట, రాజస్థాన్‌లో ప్రజాప్రతినిధులుగా ప్రధానమైన పోస్టులలో ఉన్నవారూ ఉన్నారు. మన రాష్ర్టంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మొన్నటి ఎన్నికల వరకు కాచి కులస్తులలో ఒక్కరికి కూడా ఆయా పార్టీలు అవకాశం కల్పించలేదు. హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా ఎంఐఎం అవకాశం ఇవ్వటంతో తమ అభ్యర్థిని గెలిపిం చుకున్నారు. ఈ 60 ఏళ్ల చరిత్రలో ఈ ఒక్క కార్పొరేటర్‌ మినహా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయిన వారు ఎవ్వరూ లేరు.

భూమి ేకటారుుంచాలి
img345కాచి కులస్తులకు హైదరాబాద్‌కు వంద కిలోమీటర్లలోపు రెండు వేల ఎకరాల భూమిని ప్ర భుత్వం కేటాయించాలంటారు అఖిల భారత కాచి (కుషువ) మహాసభ ఉపాధ్యక్షుడు కాచి ప్రకా ష్‌. సహజంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం మరొక ప్రదేశంలో భూమి కేటా యిస్తున్న విధంగా వందల సంవత్సరాలుగా తమ కులస్తులు భూమిని నమ్ముకుని బతుకుతు న్నారు కనుక భూమి ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. నదీ పరీవాహక ప్రదే శాలు మొదలుకుని నీటి మడుగుల వరకు ఉన్న నీటి వనరులను నమ్ముకుని బతుకుతూ ఇప్పటి కీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కాచి కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి ఏ గ్రూప్‌లోకి మార్చాలం టారు.

డి గ్రూప్‌లో ఉన్న కారణంగా తమకు రిజర్వేషన్‌ ఫలాలు అందట్లేదని చెప్పారు. లేదా నూతనంగా రూపుదిదు ్దకోబోతున్న ఎంబీసీలో తమ కులాన్ని చేర్చాలని కోరుతున్నారు. రాష్ర్టంలో కాచి కులస్తులకు ఏ విధమైన రాజకీయ ప్రాతి నిధ్యం లేదని చెప్పారు. నామినేటెడ్‌ పోస్టులలో తమ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నోట్‌
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.com కు మెయిల్‌ చేయవచ్చు లేదా వేణు గోపాల్‌ (ఫోన్‌:960342269) ను సంప్రదించవచ్చు

jkl

No comments:

Post a Comment