Tuesday 19 June 2012

ఆశ..శ్వాస బీసీలే..!


June 7, 2012
ఉప ఎన్నికల సంగ్రామంలో ఎవరెన్ని అస్ర్తాలు సంధిస్తున్నప్పటికీ బీసీలే ఆయా పార్టీల అభ్యర్ధులను విజయతీరాలకు చేర్చనున్నారు. అగ్రకులాల సంఖ్య అత్యల్పంగా ఉన్న నేపథ్యంలో బీసీలే కీలకపాత్ర పోషించనుండటంతో మూడు ప్రధాన పార్టీలూ కుల సంఘాల వెంట ప్రదక్షిణలు చేస్తున్నారుు. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు తమ పార్టీలకు చెందిన బీసీ నేతలను తరలిస్తున్నారుు. కుల సంఘ నేతలపై వల విసురుతున్నారుు. తమను గెలిపించమని ప్రాథేయపడుతున్నారుు. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల జయాపజయాలను బీసీ కులాలే శాసించనున్నారుు.

vee(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):ఉప ఎన్నికల సంగ్రామంలో ఎవరెన్ని అస్త్రాలు సంధిస్తున్నప్పటికీ బీసీలే ఆయా పార్టీల అభ్యర్ధులను విజయతీరాలకు చే ర్చనున్నారు. అగ్రకులాల సంఖ్య అత్యల్పంగా ఉన్న నేపథ్యంలో బీసీలే కీలకపాత్ర పోషించనుండటంతో మూడు ప్రధాన పార్టీలూ కుల సంఘాల వెంట ప్రద క్షణలు చేస్తున్నాయి. బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు తమ పార్టీలకు చెందిన బీసీ నేత లను తరలిస్తున్నాయి. కుల సంఘ నేతలపెై వల విసురుతున్నాయి. తమను గెలిపించమని ప్రాధేయపడుతున్నాయి. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్ధుల జయాపజయాలను బీసీ కులాలే శాసించనున్నాయి.ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీసీలే ప్రధాన పాత్ర పోషించనున్నారు. సీమ, కోస్తా, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకూ ఓటర్లు ఉండగా అందులో బీసీలు ఒక్కో నియోజకవర్గంలో 60 వేలు ఉండగా, దళితుల ఓట్లు గరిష్టంగా 20 వేలు, ఎస్టీల ఓట్లు 2-3 వేలు, మైనారిటీల ఓట్లు 5-7 వేల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.

వీరు చేయూతనిస్తేనే ఏ పార్టీ అయినా గెలిచి గట్టేక్కేది. అందుకే బీసీల ప్రాధాన్యం గ్రహించిన మూడు పార్టీలు తమ పార్టీల్లోని బీసీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.ఉప ఎన్నికల్లో బీసీల ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్‌-టీడీపీ-వెైకాపా పార్టీలు ఆయా కులాలకు సంబంధించిన నాయకులను ప్రచారంలో తరలి స్తున్నాయి. అయితే ఈ విషయంలో వెైకాపా వెనుకబడి ఉండగా, టీడీపీ-కాంగ్రెస్‌ పోటా పోటీగా దూసుకువెళుతున్నాయి. కుల సంఘాలు, కుల నేతలకు మండల, వార్డుల బాధ్యతలు అప్పగిస్తున్నాయి. మొత్తం ఉప ఎన్నికల్లో యాదవులు, కురువ, కురుబ, బోయ, కొప్పుల వెలమ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు, పద్మశాలి, వడ్డెర ఓట్లు కీలకం కానున్నాయి. తిరుపతి, మాచర్ల, ఒంగోలులో యాదవులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ మంత్రి రఘువీరారెడ్డి, పార్ధసారధిని ప్రయోగించింది. తిరుపతి ఇన్చార్జిగా పార్ధసారధిని నియమించింది.

టీడీపీ యనమల రామకృష్ణుడును అక్కడ పంపింది. మాచర్లలో వెైకాపా యాదవ నేత జంగా కృష్ణమూర్తి ఇన్చార్జిగా వ్యవ హరిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స, మంత్రి రఘువీరారెడ్డి, పార్ధసారథి, పొన్నాల, సారయ్య, ధర్మాన, పీతాని ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.రామచంద్రాపురం, నర్సాపురంలో శెట్టిబలిజలు ఎక్కువగా ఉన్న క్రమంలో పితాని అక్కడ తిరుగుతున్నారు. ధర్మాన తన జిల్లాకే పరిమితమయ్యారు. ఇక టీడీపీ విషయానికొస్తే యనమల రామకృష్ణుడు, ఎరన్న్రాయుడు, దాడి వీరభద్రరావు, దేవేందర్‌గౌడ్‌, కాలువ శ్రీనివాసులు తదితర నేతలు ప్రచార బరిలో మునిగిపోయారు. యాదవుల విషయంలో టీడీపీ కంటే కాంగ్రెస్‌ పార్టీనే ప్రచారంలో ముందుంది. తిరుపతి నియోజకవర్గంలో బలిజ, యాదవ కులాలు కీలకపాత్ర పోషించనున్నాయి. బలిజ ఓటర్లు 41 వేలు, యాదవులు 30, రెడ్డి 25, కమ్మ 11 వేల ఓటర్లు ఉన్నారు. ఎమ్మిగనూరులో బోయ 67,273, మాదిగ 23,952, మైనారిటీ 10,472, యాదవ 5172, కురవ 16325, రెడ్డి 9879, కమ్మ 802, రజక 5152, ఈడిగ 4273, బలిజ 1256, వడ్డెర 2363 ఓట్లు; రాజంపేటలో రెడ్డి 23 వేలు, క్షత్రియ 21 వేలు, కమ్మ 10 వేలు, బలిజ 26 వేలు, యాదవ 17 వేలు, వెైశ్య 6 వేలు, బలిజ 4 వేలు, ఎస్సీ 35 వేలు, ఎస్టీ 6 వేలు, ముదిరాజ్‌ 4 వేలు, విశ్వబ్రాహ్మణ 3 వేలు; ప్రత్తిపాడులో కమ్మ 53 వేలు, కాపు 41 వేలు,

మాల 34, మాదిగ 17 వేలు, రెడ్డి 18 వేలు, మైనారిటీ 12, యాదవ 13 వేలు; మాచర్లలో కమ్మ 16,11 వేలు, రెడ్డి 22,660, కాపు 13,400, మైనారిటీ 13 వేలు, యాదవ 18,416, వడ్డెర 12,926, మాదిగ 24 వేలు, మాల 8460 వేలు, సుగాలీ 13270 వేలు;అనంతపురంలో మైనారిటీ 32 వేలు, బోయ 31,457, రెడ్డి 27 వేలు, మొత్తం బీసీలు 58 వేలు, వెైశ్య 10,975, కమ్మ 10,301, క్రైస్తవులు 7910; వరంగల్‌లో మున్నూరు కాపు 20 వేలు, పద్మశాలి 15 వేలు, ఆర్య క్షత్రియ 9 వేలు, ఎస్సీలు 30 వేలు, ముదిరాజుల 10 వేలు, ఎస్టీలు 5 వేలు, యాదవ 10 వేలు, రజక 4 వేలు, విశ్వబ్రాహ్మణ 3 వేలు, వెలమ 3 వేలు; ఒంగోలులో కమ్మ 33 వేలు, కాపు 22 వేలు, వెైశ్య 22 వేలు, యాదవ 25 వేలు, మైనారిటీ 16 వేలు, ఎస్సీలు 40 వేలు, రెడ్డి 10 వేల మంది ఓటర్లు, నరసన్నపేటలో కొప్పుల వెలమ అత్యధికంగా, ఆ తర్వాత తూర్పు కాపు ఓట్లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగంలో దిగాయి.

ఎక్కడ ఏ కులాల సంఖ్య ఎక్కువ ఉంటే, అక్కడ తమ పార్టీలకు చెందిన కుల నేతలను ప్రచారంలోకి దింపుతున్నాయి. వారి ప్రభా వంతో కొన్ని ఓట్లయినా దక్కితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి. తమ తమ పార్టీల్లో ఉన్న ప్రముఖ కుల నాయకులను ఎంపిక చేసి, వారి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు పంపిస్తున్నాయి.తిరుపతిలో యాదవ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన మంత్రి పార్థసారధిని అక్కడ ఇన్చార్జిగా నియమిస్తే, అదే వర్గానికి చెందిన ఓట్ల సంఖ్య మాచర్లలో ఎక్కువగా ఉన్నందున వెైకాపా నేత జంగా కృష్ణమూర్తిని, ఒంగోలులో పాలేటి రామారావును ప్రచారంలో దింపింది. ఉదయగిరిలో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ టీడీపీ నేత బీద రవిచంద్రను పంపించారు. అయితే, వీరందరికంటే యాదవులలో ఎక్కువ ఇమేజ్‌ ఉన్న టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ మాత్రం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అనంతపురంలో బోయ కులానికి చెందిన మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు ప్రచార బాధ్యతలు మోస్తున్నారు.

మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు నియోజకవర్గాల్లోని గ్రామాలు, చివరకు వార్డులు కూడా వదలకుండా కు సంఘాల నాయకులతో సాయంత్రం వేళ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ స్థానిక నేతలతో పాటు, తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాల అగ్రనేతలతో నేరుగా ఫోన్లు చేయిస్తున్నారు. దానితో వారు కొంతవరకూ వెనక్కితగ్గి, సానుకూల వెైఖరి ప్రదర్శిస్తున్నారు. దీనితో మూడు పార్టీలూ వారిపెై దృష్టి సారిస్తుండటంపెై ఒత్తిడి పెరిగి, ఎవరి వెైపు మొగ్గు చూపాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.బీసీల పార్టీగా పేరున్న తెలుగుదేశం అన్ని బీసీ కులాలకు చెందిన నాయకులను 18 నియోజకవర్గాల్లో మోహరింపచేయగా, ఈసారి అందుకు పోటీగా కాంగ్రెస్‌ కూడా బీసీ నేతలను రంగంలోకి దింపడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ కంటే కాంగ్రెస్‌ బీసీ నేతలే ఎక్కువ చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment