Tuesday 19 June 2012

పక్కా ప్రణాళికతోనే దళితులపెై దాడి


June 16, 2012
15-vsp-3 
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌ : వంగర మండలం, లక్ష్మీపేట గ్రామలో దళితులపెై ప్రణాళికా బద్దంగానే దాడి జరిగిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ అన్నారు. శుక్రవారం స్థానిక రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు భారీ పరిశ్రమ శాఖామంత్రి గీతారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు, ఎంపి జెడి శీలంతో వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి రిమ్స్‌ డెైరెక్టర్‌ చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులెైన వారు ఎవరెైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. సమాజంలో ఇంకా కులవివక్ష, వెైషమ్యాలు కలిగి ఉండడం అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. వివాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారని, వాస్తవానికి ఈ వివాదం గతం నుండి ఉందన్నారు.

సీబీ సిఐడీ విచారణ జరిపి దోషుల వివరాలు బహిరంగ పరిచేందుకు ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ కమిటీతో ఈ ఘటనపెై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరగా నేరవేర్చి బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దళిత మంత్రులు అందిస్తున్నట్లు మంత్రి గీతారెడ్డి క్షతగాత్రులకు తెలిపారు. ఆదే విధంగా గాయపడినవారికి రూ 25వేలు, స్పల్పంగా గాయపడినవారికి రూ.10 వేలు అందించనున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment