Tuesday 19 June 2012

నలుగురు దళితుల నరికివేత


June 13, 2012
12-vsp2శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌: శ్రీకాకుళం జిల్లాలో దళితులపెై దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ దాడిలో నలుగురు దళితులు హతమయ్యారు. అగ్రవర్ణాలు ఏకమై చేసిన ఈ దాడిలో మరో 21 మంది గాయపడ్డారు. భూ వివాదంలో జరిగిన ఈ దాడిపెై కుల సంఘనాయకులు రంగంలోకి దిగారు.మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పంట భూమిని అందివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, క్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపెై అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగారు. మడ్డువలస రిజర్వాయర్‌ పథకంలో ముంపునకు గురెైన క్ష్మీపురం గ్రామానికి చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందుకు నష్టపరిహారం కూడా ఇచ్చింది.

ఇది జరిగి దాదాపు 10 ఏళ్లు అయింది. గ్రామం కూడా మునిగిపోవడంతో వారికి కావలసిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు స్థలాన్ని కూడా సమకూర్చారు. అయితే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంచకపోవడంతో సేకరించిన భూమిలో 60 ఎకరాలు ముంపునకు గురవలేదు. ఇది గమనించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది దళితులు సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తగదని ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల రెైతులు ఆటంకపర్చారు. ఈ వివాదం గత నాలుగేళ్లగా జరుగుతోంది. ఈ లోగా ఒకరిపెై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, రాజీ పడడం జరుగుతోంది. అయితే ఇది మరింత ముదరడంతో గమనించిన పోలీసు అధికారులు గ్రామంలో ఎటువంటి తగాదా రాకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా పోలీసులు ఆ గ్రామానికి సోమవారం , మంగళవారం పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయారు. ఇది గమనించిన రెైతులు మూకమ్మడిగా దళితులపెై మారణాయుధాలతో దాడి చేశారు.

ఉన్నఫలంగా దాడి చేయడంతో ఎన్‌. వెంకటి (60), బి సుందరరావు (40), సిహెచ్‌ అప్పడు (35), ఎన్‌ సంగమేసం (40)లు మరణించారు. అదే విధంగా మరో 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అగ్రవర్ణాలకు చెందిన 9 మంది రెైతులు కూడా గాయాల పాలయ్యారు. క్షత గాత్రులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అగ్రవర్ణాల దాడిలో మృతి చెందిన నలుగురు కుటుంబాలకు ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, యువజన నాయకులు మజ్జి గణపతి డిమాండ్‌ చేశారు. ప్రతీ ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రతీ ఇంటికి రెండు ఎకరాల చొపున్న పంట భూములు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్య హేహ్యమైనదిగా వర్ణించారు. తక్షణమే నిందితులను పట్టుకుని కఠినంగా క్షించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment