Tuesday 19 June 2012

దర్జాలేని దర్జీ బతుకు


June 13, 2012
కొలతలు తీయడానికి టేపులేని రోజులో మూర, జాన, బెత్త... లెక్కల చొప్పున కొలతలు తీసేవారు. రాసుకునే పద్ధతులు లేకపోవటంతో తీసుకున్న కొలతల ప్రకారం బట్టలేక ఎక్కడికక్కడ గాట్టుపెట్టి చించేవాళ్లు. కనుకనే వీళ్లని చింపేవాళ్లని చెప్పుకునేవారు. కాలక్రమంలో చింపేవాళ్లు కాస్తా చిప్పోలుగా మారారు. వీరే మేరు కులస్థులు. వీరి కుల వృత్తి దర్జీపని. తనకు తెలిసిన విద్య నలుగురికీ నేర్పి ఉపాధి కల్పించిన ఈ స్నేహశీలికి అన్నీ కష్టాలే!

jangamaమేరు కులస్తులు పూర్వపు రోజుల్లో సంచార జాతిగా జీవనం గడిపేవారు. ఇంటిల్లపాదీ ఊరూరా తిరుగుతూ బట్టలు కుట్టి జీ వించేవారు. అంతేకాదు... సైన్యంలోని సైనికుల దుస్తులు, వా రి కుటుంబ సభ్యులకు కావలసిన దుస్తులు కుట్టడానికి మేరు కులస్తులు వారి వెంట ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెజి మెంట్లు ఏ ప్రాంతానికి తరలిపోతే వీరూ... వారి వెంట వెళ్లాల్సి వచ్చేది. ఈ విధంగా తిరిగి తిరిగి చివరకు హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, బెంగళూరులోని జాల హళ్లి, మహారాష్ర్టలో పూ ణ, ఖడ్కి, ఔరంగాబాద్‌, నాగపూర్‌లలో ఛావనీలో వీరు స్థిర ని వాసం ఏర్పరచుకున్నారు. మహారాష్ర్టలో సింపీ క్షత్రియులుగా ఉన్న వీరు మన రాష్ర్టంలో చిప్పోలు, మేరు కులస్తులుగా వీరు పిలువబడుతున్నారు. రాష్ర్ట వ్యాపితంగా వీరు విస్తరించినప్ప టికీ తెలంగాణ ప్రాంతంతోపాటు, గుంటూరు, కృష్ణా జిల్లాల లోనే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.

జనాభా రీత్యా వీరు తక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా ఇత ర కులాలవారికి వీరు టైలరింగ్‌ వృత్తి నేర్పి పని కల్పించారు. నీడపట్టున ఉండి పనిచేయటం, రోజుగడిచేందుకు చేతికి డబ్బు అందుతున్న కారణంగా అనేకమంది ఈ వృత్తికి ఆకర్షి తులయ్యారు. పండుగ సీజన్‌ వచ్చిందంటే రాత్రింబవళ్లు పని చేసేవారు. కుట్టుమిషన్‌ ఉన్న స్పీడుతో పోటీపడి పనిచేసి కస్ట మర్లను తృప్తి పరిచేవాళ్లు. మహిళలు, పిల్లలూ కలిసి కాజాలు తీయటం, గుండీలు, హుక్కులు కుట్టటం, చేతిపని చేస్తూ సహకరించేవారు. ఈ విధంగా వచ్చే డబ్బుతోనే వీరు జీవనం సాగించేవారు. బట్టలు కుట్టించుకోవటం ఏడాదికి ఒకసారి వచ్చే పండగలకే పరిమితం కావటంతో వీరు సీజన్‌లో సంపాదించుకున్న డబ్బును పొదుపుగా వాడుకుని అన్‌సీజన్‌ లో కుటుంబ ఖర్చు లకు ఉపయోగించుకునేవారు.

పూర్వం చేతివృత్తిగా ఆవిర్భవించిన దర్జీపని నేడు పెద్ద ఇండ స్ట్రీగా వెలుగొందుతోంది. కాగా అందులో వీరు దినసరి కార్మి కులుగా పనిచేయాల్సి వస్తోంది. అదికూడా అత్యల్పసంఖ్యలోనే వీరు పనిచేస్తున్నారు. వాస్తవానికి పెడల్‌ మిషన్‌ స్థానంలో ఎల క్ట్రికల్‌ సూయింగ్‌ మిషన్లు చోటుచేనుకున్న రోజుల్లోనే తమకు కష్టకాలం దాపురించిందనే అంశాన్ని పసిగట్టారు. కుల వృత్తి లోకి ఇతరులు చొచ్చుకురావటం కూడా వీరికి సమస్యగా మారింది. వీటికితోడు కటింగ్‌ మిషన్లు రావటంతో వీరి మను గడే ప్రశ్నార్ధకరంగా మారింది. ఇక ‘జుకి’ మిషన్‌ రంగప్రవే శంలో మేరు వృత్తిదారులే కాదు, యావత్‌ టైలరింగ్‌ రంగం కుదేలయ్యింది. ఈ మిషన్‌ ద్వారా భారీ ఎత్తున రకరకాల ఫ్యా షన్లతో డ్రస్పులు తయారవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న బడా వ్యాపారులు రాష్ర్టంలో ఇండస్ట్రీస్‌ ప్రారం భించి లాభాలు ఆర్జిస్తున్నారు. దాదాపు పాతిక వరకు ఇటువం టి ఇండస్ట్రీలు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక్కొక్క ఇండ స్ట్రీలో దాదాపు 300మందికి జీవనోపాధి దొరుకుతున్నప్పటికీ మేరు కులస్తులకు మాతం ఉపాధి లభించింది బహుతక్కువ.

ప్రపంచం స్పీడ్‌ కావటంతో ఎక్కువమంది రెడీమేడ్‌ దుస్తు లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

నుక మేరు కులస్తులు పనికోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. రెడీమేడ్‌ డ్రస్‌ సెంటర్ల సంఖ్య గణనీయంగా పెరుగడంతో వీరు ఉపాధి కోల్పోతు న్నారు. కొత్త జత వేసుకోవాలంటే బట్టల కొనుగోలుతోపాటు దర్జీకి కుట్టుకూలీయే జత బట్టలకు రూ.200 ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో రెడీమేడ్‌ షాపులవెైపే సామాన్య మానవులు సైతం పరుగులు తీస్తున్నారు.ఈ నేపథ్యంలో రోజు మొత్తం కు ట్టుపని చేసినా మేరు కులస్తులకు వంద రూపాయల సంపాద నలేదు. ఇక పీస్‌ వర్క్‌ కూడా వీరి వృత్తిని దెబ్బతీస్తోంది. బడా బాబులు హంగులతో రూపుదిద్దుకున్న షాపుల నుంచి వీరికివ చ్చే పీస్‌ వర్క్‌ వారి దయాదాక్షిణ్యాలపెై ఆధారపడాల్సి వస్తోంది. కనుకనే ఈ వృత్తికి దూరమవుతున్నారు. బతుకుదెరువు కోసం మరో పని చేసుకునే ప్రయత్నం చేస్త్తున్నారు. ప్రభుత్వపరంగా మేరు కులస్తులకు ఎటువంటి సహాయం అందలేదనే చెప్పాలి. పాఠశాలల్లో క్రాఫ్ట్‌ క్లాసులు నిర్వహించి కుట్టు పనిని ప్రభుత్వం ప్రోత్సహించింది.

వీటి ద్వారా ఇతర కులాలవారు ఇందులో ప్రవేశించారు. అదే విధంగా నిఫ్ట్‌ ద్వారా ఫ్యాషన్‌ టెక్నాలజీని ప్రోత్సహించింది. ఫలితంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఈ వృత్తిని కైవశం చేసుకున్నారు. మహిళలకు ఉపాధి పేరుతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కుట్టు మిషన్లు అందించటంతో మేరు కులస్తులకు అరకొరగా అందుతున్న ఉపాధికి కూడా గండి పండింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేరు కులస్తుల అభివృద్ధికి సబ్సిడీలు కాదుకదా, కనీసం బ్యాంకు లోనులు కూడా ఇచ్చి ప్రోత్సాహించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో చెైనా మ్యూజియంలో పెడల్‌ కుట్టుమిషన్‌ ఏ విధంగా చోటు సంపాదించుకుందో ఇక్కడా అటువంటి పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది.

ఆర్ధికంగా ఆదుకోవాలి;
drjiవివిధ కులాలకు చెందివారు దర్జీ పనిని ఎంచుకోవడం, అటు రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలతో పోటీపడలేక మేరు కులస్తులు అర్థాకలితో జీవితాలు గడుపుతున్నారు. కనుక ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మేరు సంఘం రాష్ర్ట అధ్యక్షులు కీర్తి ప్రభాకర్‌ కోరుతున్నారు. కుట్టు పని చేసేవారికి ప్రభుత్వం ఫెడరేషన్‌ ప్రకటించినప్పటికీ తమ మేరు కులస్తులకు మాత్రం అది ప్రయోజనం చేకూర్చలేదంటారు. కనీసం వృద్థులెైన మేరు కులస్తులకు ప్రత్యేకించి వృద్ధాప్య పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వృత్తి దెబ్బతినడంతో ఇప్పటితరం విద్య పట్ల శ్రద్ధ చూపుతున్నారు కనుక మేరు కుల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

తమని ప్రభుత్వం బిసి డి జాబితాలో చేర్చడం వలన న్యాయంగా తమకు అందాల్సిన ఫలాలు అందట్లేదని చెప్పారు. మేరు కులస్తులు సంచార జాతికి చెందిన వారు కావటంతో బిసి ఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్‌ యూనిఫారం, హాస్పిటల్స్‌లో ఉపయోగించే డ్రస్‌లు, హాస్టల్‌ విద్యార్ధుల డ్రస్‌లు కుట్టే అవకాశం ప్రభుత్వం మేరు కులస్తులకు ఇచ్చి ఆదుకోవాలంటారు.

jkl

No comments:

Post a Comment