Tuesday 19 June 2012

వెదురు వెతలు


June 5, 2012
హిందూ సంప్రదాయంలో పుట్టిన శిశువును చేటలో వేస్తారు.... మృతి చెందాక వెదురు బద్దలతో చేసిన పాడెపైనే అంతిమయాత్రకు తీసుెకళతారు. వెదురుతో బంధం చావు-పుట్టుకలేక పరిమితం కాలేదు. చావు పుట్టుకలమధ్య జరిగే అనేక కార్యక్రమాలతో వెదురు అవసరం కనిపిస్తుంది. అరుుతే సమాజంలో అంతర్లీనంగా పెనవేసుకున్న ఈ వెదురుకు రూపాన్నిచ్చే మేదర్ల పరిిస్థితి మాత్రం దినదినగండం నూరేళ్ల ఆయుష్షూలా మారింది. ప్లాస్టిక్‌ రంగప్రవేశంతో వృత్తి కోలుకోలేని దెబ్బతింది. అరుునప్పటికీ తమ సృజనను ప్రోదిచేసి కుల వృత్తికి జీవంపోసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మేదర్లు!

veduruదశాబ్దం కిందటి వరకు మేదరి కులస్తులకు చేతినిండా పనే! ఇళ్లల్లో ఉపయోగించే గంపలు, చాటలు, తడికెలు, విసనకరల్రు వీరు తయారు చేసివనే. పండిన కూరగాయలు మార్కెట్‌ చేయడానికి అనువెైన బుట్టలు, తమలపాకు బుట్టలు, బొగ్గుగనుల్లో ఉపయోగించే తట్టలు మొదలు... పెళ్లి పందిళ్లు, మేనమామలు పెళ్లికూతుర్ని తీసుకువచ్చే గంపలు, సారె గంపలు... వీరి చేతులమీదుగా తయారెైనవే. అప్పట్లో శుభకార్యాలలో వెదురు గంపలలోనే భోజనం తీసుకొచ్చి వడ్డించేవారు. అంతేకాదు... ఇంటికి కావలసిన అలంకరణ వస్తువులను కూడా వీరే తయారుచేసేవారు. ఇంత చేసినా వీరు కూడా అప్పట్లో వివక్ష ఎదుర్కొన్నారు! మేదరి కులస్తులు తయారు చేసిన చేటలు, బుట్టలు... వంటి వస్తువులను కొనుగోలు చేసిన గృహస్తులు వాటిపెై నీళ్లు చల్లి... శుద్ధి చేసుకుని ఇంట్లోకి తీసుకుపోయేవారు!అప్పట్లో అడవుల్లో వెదురు పొదలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని జీవించేవారు.

సమీప అడవుల్లోకి వెళ్లి తమకు కావలసిన వెదుర్లను ఎంచుకుని వాటిని నరికి, మోపులు కట్టి గాడిదలపెై వేసుకుని తమ నివాసాలకు చేరుకునేవారు. ఈ వెదుర్లతో కావలసిన పరికరాలు తయారు చేసేవారు. రోజుకు రెండు, మూడు వెదుర్లకు మించి వీరు పనిచేయలేరు. తయారు చేసిన వస్తువులు సైకిల్‌కు కట్టుకుని మార్కెట్‌ చేస్తారు. మరికొందరు వాటిని ఒకదానిలో ఒకటి పేర్చి కావిళ్లకు కట్టుకుని సమీప గ్రామాలలో అమ్మి జీవనం సాగించేవారు. వెదురు కోసం వెళ్లిన వీరిపెై అటవీ అధికారులు దౌర్జన్యం చేసేవారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుతీసేవారు. ఒక్కోసారి వీరి పనిముట్లను అధికారులు లాక్కునేవారు. ఇటువంటి దయనీయ పరిిస్థితులలో బతుకుపోరాటం చేస్తూనే మరోపక్క హక్కుల సాధనకు ఉద్యమించారు.ఈనేపథ్యంలో ప్రభుత్వం 1964 యాక్టు తీసుకొచ్చింది.ఫలితంగా వెదురు పొసైటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సొసైటీ ద్వారా ఒక్కో సభ్యునికి ఏడాదికి రెండు వేల వెదుర్లు సబ్సిడీ ద్వారా ఇవ్వాటానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖలో వీరి సొసైటీని రిజిస్టరు చేసుకుంటే అటవీశాఖ సబ్సిడీపెై వెదురు ఇస్తుంది.

అయితే వీరు ప్రతి ఏడాదీ రెన్యువల్‌ చేయించుకోవాలనే నిబంధన పెట్టటంతో నానా అగచాట్లు పడుతున్నారు. వీరు జిల్లా పరిశ్రమల కేంద్రంవారు ఇచ్చిన రెన్యువల్‌ ఆర్డర్‌ తీసుకొని కేటాయించిన ఫారెస్టు సర్కిల్‌ కార్యాలయానికి వెళ్ళాలి. ఆ అధికారి ఏమైనా సమర్పించుకుంటేనే ఆర్డర్‌ ఫారంపెై సంతకం లేకుంటే ఏదో ఒక కొర్రి వేసి తిప్పుతుంటారని చెపుతున్నారు. కొల్లాపూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయానికి వెళ్ళాలంటే డబ్బుతోపాటు, కాలం కూడా వృధా. కనుక రోజుల తరబడి తిరగలేక ఎంతోకొంత ముట్టచెప్పుకుని రెన్యువల్‌ చేయించుకుంటున్నామని చెపుతున్నారు. అంతేకాదు... పేపర్‌ మిల్లులకు ఇచ్చే వెదుర్లపెై టన్నుకు ఆరు వేల రూపాయలు తగ్గించి, మేదర్లకు మాత్రం పది వేల రూపాయలు పెంచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ప్లాస్టిక్‌ రంగ ప్రవేశంతో వీరి వృత్తి దెబ్బతింది. వీరుచేసే ప్రతీ వస్తువూ ప్లాస్టిక్‌ రూపంలో దర్శమిస్తున్నాయి. పెైగా ఒరిస్సా, మిజోరం, త్రిపుర నుండి అలంకరణ వస్తువులు రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. కళాకృతులను రూపొందించే సత్తా తమకూ ఉందనీ, ఇందుకుగాను శిల్పారామం, ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌లో తమకూ అవకాశం ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు... అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలలో అటవీ ప్రాంతం నుండి మేదర్లు కావల్సినంత వెదుర్లు తెచ్చుకోవచ్చనీ, అదే విధానాన్ని మరో రాష్ర్టంలో అమలు చేయాలని ప్రతిపాదన వీరు తెస్తున్నారు. ఇదిలా ఉంటే... అనంతపురంలో పెద్ద ఎత్తున వెదురు వస్తువులు తయారు చేసినా అక్కడ మార్కెట్‌ లేకపోవటంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ విధంగా వచ్చే వెదురు వస్తువుల లారీలను ఫారెస్టు శాఖ వారు అటకాయించి మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 10 నుంచి 15 వేల రూపాయల వరకూ ఫెైన్‌ వేయటంతో అంత పెద్ద మొత్తం చెల్లించుకోలేని మేదర్లు ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోందంటారు.

ఈ నేపథ్యంలో కుల వృత్తిని కొనసాగిస్తూనే వీరు ప్రత్యామ్నాయ వృత్తులను ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలలో మేకలు కోసి ఆ మాసం మార్కెట్‌ చేసి జీవిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో పందులను కాస్తున్నారు. 1953కు పూర్వం మేదర్లు, ఎరుకల వారూ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒకే గ్రూప్‌ కింద ఉండేవారు. అయితే తరువాత జరిగిన పరిణామాలలో వీరిని బీసీ రిజర్వేషన్‌ జాబితాలోని ఏ గ్రూప్‌లో చేర్చిన ప్రభుత్వం ఎరుకలను ఎస్టీ జాబితాలోకి చేర్చింది. దీంతో మేదర్ల ఎదుగుదల నత్తనడకన నడుస్తోంది. దేశవ్యాప్తంగా వీరు ఎస్సీలు, ఎస్టీలుగా గుర్తింపు పొందినా. మన రాష్ర్టంలో మాత్రం బీసీలుగానే ఉన్నారు.

మేదరి ఫడరేషన్‌ విధులు... నిధులు... నిల్‌!
P.-Balarajuరాష్ర్ట ప్రభుత్వం మేదర్లకు ఫెడరేషన్‌ ప్రకటించినా విధులు... నిధులు... లేవని మేదరి సంఘం ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట అధ్యక్షుడు ప్యారసాని బాలరాజు తెలిపారు. మేదరి సామాజిక వర్గానికి చెందివవారు ఇతర రాష్ట్రాలలో ఎస్టీలుగానో, ఎస్సీలుగానో ఉన్నారనీ, మన రాష్ర్టంలో మాత్రం బీసీ గ్రూప్‌లు ఉన్నారని చెప్పారు. ఆది నుండీ తాము సంచార జీవులమంటారు. ఇప్పటికీ వెరుదు డిపోలకు దగ్గర్లో ఉన్న మేదర్ల జీవన శెైలిని గమనిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయంటారు. ఈ నేపథ్యంలో మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతన్నారు. మేదర్లు కులవృత్తిపెైనే ఆధారపడి జీవిస్తున్నారు కనుక ఈ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ప్రతి జిల్లాలో ఉన్న తమ సొసైటీలకు వెదురు వనాలు పెంచటానికి 50 ఎకరాలకు భూమి హక్కు ఇస్తే మంచి ఫలితం ఉంటుందంటారు. మేదర్లు అత్యంత వెనుకబడిన తరగతులకు చెందివవారు కావడంతో ప్రభుత్వమే తమకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలంటారు. చట్టసభలలో తమ సామాజికి వర్గానికి చెందవారు లేరుకనుక కనీసం నామినేటెడ్‌ పోస్టులెైనా కేటాయించాలంటారు.
ghjj

No comments:

Post a Comment