Tuesday 19 June 2012

‘మందు’లోళ్లకు మనుగడే కష్టం


June 6, 2012
మందులు.. మందులు.. మందులు.. మహిమగల మందులు.. టక్కుటమారం లేని మందులు.. కీళ్ల నొప్పులకు మందులు.. వాతపైత్యాలకు మందులు.. కండ్లకు పండ్లకు పుండ్లకు మందులు.. అశ్వినీ దేవతల మందులు.. మంత్రం తంత్రం లేని మందులు.. రండయ్యా రండీ.. వనమూలికలన్నీ కొనరండి.. భస్మాలూ, లేహ్యాలు, తైలాలూ.. రోగాలను హరించేనండీ!... అంటూ మందువాళ్లు తమ మందుల మహిమను చెప్పుకుంటూ గ్రామీణ ప్రజలలో ఆసక్తి రేపేవారు!

mandu‘మందుల’... వీరిది విలక్షణ శైలి. అటు గిరిజనులలో కలవాలనుకుంటున్నా ప్రభుత్వం కలపట్లేదు. ఇటు నాగరికులతో కలిసిజీవించలేకపోతున్నారు. కనుకనే ఊరి చివర్న ఉండే యానాదులతో దోస్తీ చేస్తున్నారు. అనాగరిక లక్షణాలు వీరిని ఇంకా వెంటాడుతున్నాయి. వారి భాష, వేషం, కట్టుబాట్లలో ఎటువంటి మార్పులేదు. ఈ కులస్తులు ఆచారవ్యవహారాలు, మూఢనమ్మకాలకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే వీరింకా అనాగరిక కట్టుబాట్ల నుంచి బయటపడ లేపోతున్నారు. ప్రభుత్వం కూడా వీరిని చైతన్యపరిచే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ అనేక జిల్లాల్లో హీనాతి హీనంగా జీవనం గడుపు తున్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా వీరు విస్తరించి ఉన్నా తెలంగాణ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తారు. వీరు వృత్తిరీత్యా మందులు తయారు చేస్తారు. వీరికితెలుసు ఏ ఆకులో ఏ సుగుణాలు ఉన్నాయో, ఏ వేరులో ఏ లక్షణాలు ఉన్నాయో. పైగా ఏఏ వనమూలికలు ఎప్పుడు... ఎక్కడ దొరుకుతాయో కూడా వీరు ఇట్టే చెప్పగలరు. వనమూలికలు అవసరమైన నాటువైద్యులే కాదు, ఆయుర్వేద వైద్యులు సైతం వీరిని ఆశ్రయించిన సందర్భాలు కోకొల్లలు. వీరు వనాలలో ఆకులు, చెట్ల బెరడు, వేళ్లు... సేకరిస్తారు. వీటి నుండి వివిధ ప్రక్రియల ద్వారా రసం తీస్తారు. చెట్ల ఆకులు, బెరడులను నూనెతో కలిపి దంచి ఔషధాలు తయారు చేస్తారు. కొన్ని వనమూలికలకు కర్పూరం... కలిపి కుండల్లో వేసి కాగబెడ దారు. వీటినుండి వచ్చిన ఆవిరి కుండకు పై భాగంలో బోర్లిం చిన మూతకు దట్టంగా పేరుకుంటుంది.

ఆ మూత చల్లారాక దానికి అడుగుభాగంలో అంటుకున్న మొత్తాన్ని సేకరించి మెత్తని పొడి చేసి మందుగా తయారు చేస్తారు. భైరవ, చింతా మణి... వంటి మాత్రలు కూడా వీరే తయారుచేస్తారు. ఈ విధంగా తయారుచేసుకున్న మందులను మగవారు సంచు ల్లోనూ, ఆడవారు గంపల్లోనూ పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల లో అమ్మకాలు చేస్తారు. వీరి అలవాట్లన్నీ గిరిజనుల లక్షణాలను పోలి ఉంటాయి. వీరి పూర్వీకులును అప్పటి ప్రభుత్వం సంచార జాతిగా గుర్తించింది. అప్పట్లో వీరు ఎక్కువగా ఊరికి చివర్న ఉన్న చెరువులు, కాల్వగట్లపైన, తాటితోపుల్లో ఉండేవారు. పది పన్నెండు కుటుంబాలు కలిసి సమూహంగా జీవించేవారు. వీరు గ్రామగ్రామానా సంచారం చేసి జీవిస్తారు. తాటి ఆకులు, ఈత ఆకులు, వెదురుబొంగు లతో చిన్నచిన్న ఇళ్లు నిర్మిస్తారు.

అందులో చిన్న మంచం, ఈత ఆకుతో తయారు చేసిన బుంగల్లో నిత్యావసర వస్తువులు దాచుకుంటారు. మొక్కజొన్నలు, సజ్జలు, దంపుడు బియ్యం వీరివెంట ఉంటాయి. జొన్న అన్నం, గట్కాతో రోజులు గడుపుతారు. తాటాకుతో తయారు చేసిన చిన్న పెట్టెలో డబ్బు దాచుకుంటారు. దీనితోపాటు ఒక పెంపుడు కుక్క ఉంటుంది. ఆవు మాంసం తప్ప దాదాపు అన్ని జంతువులనూ వీరు తింటారు. మరో ఊరికి మకాం మారాలంటే క్షణాల్లో ఇల్లు పీకి గాడిదలకెత్తుతారు! పదీ, పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడ గుడిసెలు వెస్తారు. ఇతర కులాలకన్నా వీరి ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ఈ కులంలో ఇంటి పేర్ల ఆధారంగా వివాహాలు జరుగుతాయి. ఆడపిల్లలకు రూ.200 నుండి 3,500 వరకు ఓలె చెల్లిస్తారు. మేనరికాలు సర్వసా దారణం. వీరికి ప్రత్యేకమైన బాష ఉంది.

ఈ బాషలోనే వారి ఇళ్లదగ్గర మాట్ల్టాడుకుంటారు. మందుల వాళ్లలో మూఢనమ్మ కాలు ఎక్కువ. జీవితంలో ఆశలు తీరని వ్యక్తి చనిపోతే దెయ్య మై తిరుగుతూ కోర్కెలు తీర్చుకుంటుందనే నమ్మకం వీరిలో ఇప్పటికీ ఉంది. కనుకనే ఇటువంటి వాటికి విరుగుడు పేరుతో వీరిని దోచుకునే వారూ ఉన్నారు. ఇప్పటికీ గడ్డపార కాల్చి పట్టుకోమనడం, మరుగుతున్న నూనెలో చేయిపెట్టించటం వంటి అనాగరిక లక్షణాలు కొనసాగుతు న్నాయి. కోర్టుకు వెళ్ళినా, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కులం నుంచి వెలివేస్తారు. కనుక ఎవ్వరూ అటువంటి ఆలోచనలు చేసే సాహసం చేయరు.అయితే ఇంగ్లీషు మందులు రావడంతో వీరికి గిరాకీ తగ్గింది. బతుకు భారమైంది. దీంతో వీరు ఎంతో కాలంగా స్నేహం చేస్తున్న యానాదులు పెంచుకునే పందుల పెంపకం వైపు దృష్టి మళ్లిం చారు.

మందుల వ్యాపారం కన్నా పందుల పెంపకమే ఎక్కువ లాభకరం. ప్రతీ ఆరు నెలలకు కనీ సం ఏడెనిమిది పిల్లలను పెడతాయి.పెంపకానికి ఖర్చు కూడా తక్కువే. కాగా పంట పొ లాల్లో పశువులు పడితే బందెలదొడ్డి లో పెట్టడం ఆనవాయితీ. అయితే వీరు పెంచుతున్న పందులు పొలంలో పడితే మాత్రం వాటిని పొడిచి చంపేస్తారు. అంతేకాదు... వాటి యజమాను లైన మందులవాళ్లను కూడా వెంటాడి ఊరి నుండి తరిమేస్తు న్నారు! అయితే ఇప్పటికీ కుల వృత్తిని నమ్ముకున్నవారు వైద్యం చేస్తూనే కాలం గడుపుతు న్నారు. ఇక ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కొందరు పాములుపట్టి ఆడిస్తారు. మరికొందరు ప్లాస్టిక్‌, స్టీలు, అల్యూమినియం సామాన్లు అమ్మి బతుకుబండి ని లాగు తున్నారు. ఈ వ్యాపారానికి 10 నుండి 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి కనుక అప్పులు చేస్తున్నారు. రోజుకు ఐదు రూపాయల వడ్డీ కావడంతో రూపాయి కూడా వెనకేయలేకపోతున్నారు.

ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
gopalకుల వృత్తి దెబ్బతినడంతో చిరువ్యాపారాలవైపు మొగ్గు చూపుతున్న మందుల కులస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ సంచార జాతుల మందుల కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు వాడపల్లి గోపాల్‌ మందుల కోరుతున్నారు. మందుల కులస్తులు ఊరి చివర్న బతుకుతూ అన్నింటా వెనుకబడి ఉన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐఏవై పథకం అమలుచేసి ప్రత్యేక కాలనీలు ఏర్పాటుచేసి తమ సామాజికవర్గ సంక్షేమానికి కృషి చేయాలంటారు. మందుల కులస్తులకు ఆది నుండీ గిరిజన లక్షణాలు ఉన్నాయి కనుక ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు.

కులాలవారీగా స్మశానవాటికలు ఏర్పడడంతో తమ కులస్తులు మృతి చెందింతే కనీసం పూడ్చేందుకు స్థలంలేక నానా తంటాలు పడుతున్నామని చెప్పారు. తీవ్రమవుతున్న ఈ సమస్యను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని మృత దేహాలను ఖననం చేయడానికి స్థలం కేటాయించమంటారు. విద్యాపరంగా ప్రొత్సహించేందుకు మందుల విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు కేటాయించాలంటారు.

నోట్‌
బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను www.suryaa.com చేయవచ్చు లేదా వేణుగోపాల్‌
(ఫోన్‌: 96034 62269) ను సంప్రదించవచ్చు
table

No comments:

Post a Comment